Sunday, May 19, 2024

తెలంగాణ నుంచి తరలిపోతున్న కంపెనీలు..గుడ్ బై చెప్పిన కేన్స్..!

spot_img

తెలంగాణరాష్ట్రంలో కొత్త సర్కార్ కొలువుదీరి మూడు నెలలైనా కాకముందే పెట్టుబడిదారుల్లో విశ్వాసం పోతోంది. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రానికి క్యూ కట్టిన కంపెనీలన్నీ ఇప్పుడు రాష్ట్రానికి గుడ్ బై చెబుతున్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తయారీ కంపెనీ గతేడాది చెన్నైకి పోయింది. తాజాగా సెమీ కండక్టర్ల తయారీ కంపెనీ అయిన కేన్స్ సెమీకాన్ కంపెనీ గుజరాత్ కు తరలిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రూ. 2,800కోట్లతో కొంగరకలాన్ లో సెమీ కండక్టర్ల తయారీ యూనిట్ కోసం కేన్స్ సెమీకాన్ గతేడాది అక్టోబర్ లో శంకుస్తాపన చేసింది. 2నెలల పాటు కొనసాగిన నిర్మాణ పనులను ఆ తర్వాత నిలిపివేసింది. ఏమైందో తెలియదు కానీ రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటు ప్రణాళికను అకాస్మాత్తుగా నిలిపివేసింది. ఇప్పడు ఈ పరిశ్రమను గుజరాత్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు జాతీయ వార్త పత్రిక కథనాన్ని ప్రచురించింది.

మనం రాష్ట్రం నుంచి కంపెనీలు తరలిపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళణ వ్యక్తం చేశారు. సెమీకండక్టర్ చాలా కీలకమైన పెట్టుబడిగా భావిస్తున్న కేన్స్ సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్ కు తరలిపోతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ కంపెనీ కర్నాటకకు వెళ్లేందకు సిద్ధపడితే ఎన్నో ప్రయత్నాలు చేసి తెలంగాణలోనే పెట్టుబడికి ఒప్పించామన్న సంగతిని గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: దేశాన్ని విభజించేందుకే సీఏఏ ను తీసుకొచ్చారు

Latest News

More Articles