Friday, May 17, 2024

పెళ్లి ఊరేగింపు నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. కారులో 8 మంది సజీవదహనం

spot_img

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని భోజిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో గల నైనిటాల్ హైవేపై శనివారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బరేలీ నుంచి బహేరీ వైపు వెళ్తున్న ఎర్టిగా కారు టైరు పగిలి, డివైడర్‌ను దాటి అటువైపు నుంచి వస్తున్న డంపర్‌ను ఢీకొంది. దీంతో ఈ రెండు వాహనాల్లో పేలుడు సంభవించి, మంటలు చెలరేగడంతో కారులో ఉన్న ఎనిమిది మంది సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పివేసి, వాహనాలను రోడ్డు మధ్య నుంచి తొలగించారు.

Read also: సూసైడ్ అటెంప్ట్ చేసిన మహిళా బీట్‌ ఆఫీసర్‌

బహేరీకి చెందిన కొంతమంది పెళ్లి ఊరేగింపులో పాల్గొని, తిరిగి రాత్రి 11.45 గంటలకు బహెరీకి తిరిగి వస్తున్నారు. భోజిపురా పోలీస్ స్టేషన్‌కు 1.25 కి.మీ దూరంలోని బహెరీ దిశలో ఉన్న దబౌరా గ్రామ సమీపంలో కారు టైరు అకస్మాత్తుగా పగిలింది. దీంతో కారు బ్యాలెన్స్‌ తప్పి డివైడర్‌ను దాటి అటువైపు నుంచి ఎదురుగా వస్తున్న డంపర్‌ను ఢీకొట్టింది. పెద్ద శబ్ధంతో కారులో మంటలు చెలరేగాయి. డంపర్ ఈ కారును దాదాపు 25 మీటర్ల మేరకు ఈడ్చుకెళ్లింది. డంపర్ ముందు భాగం కూడా మంటల్లో చిక్కుకుంది. కాగా.. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారు సెంట్రల్ లాకింగ్ లో ఉండటంతో డోర్లు ఓపెన్ కాలేదు. దాంతో కారులో ఉన్న 8 మంది సజీవదహనమయ్యారు. వెంటనే డంపర్ డ్రైవర్, హెల్పర్‌.. భయంతో వాహనం నుంచి దూకి పారిపోయారు. వాహనదారులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.

 

View this post on Instagram

 

A post shared by NDTV (@ndtv)

Latest News

More Articles