Saturday, May 4, 2024

బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు.!

spot_img

మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఫిర్యాదుపై హైదరాబాద్ లోకసభ బీజేపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదు అయ్యింది. సిటీలోని ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఏప్రిల్ 17న శ్రీరామనవమి శోభాయాత్రలో పాల్గొన్న ఆమె, సిద్దిఅంబర్ బజార్ సర్కిల్ వద్ద ఉన్న మసీదు వైపు బాణం గురిపెట్టి వదులుతున్నట్లు ఊహాజనిత సంజ్న చేశారని ఇమ్రాన్ తన ఫిర్యాదులో తెలిపాడు. ఆమె బాధ్యతారహిత చర్చకు పాల్పడ్డారని..ముస్లిం సమాజం మనోభావాలను దెబ్బతీశారని ఫిర్యాదు పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థిగా మాధవిలతను ప్రకటించిన నాటి నుంచి ఆమె ముస్లిం సమాజంపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు.

దీంతో ఐపీసీలోని 295ఏ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125 హానికరమైన చర్యలకు పాల్పడటం వంటి సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా మసీదు వైపు బాణం వేస్తున్నట్లుగా మాధవి లత ఇచ్చిన సంజ్నకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఎన్నికల సంఘం మౌనంగా ఉందంటూ ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. ఈ విమర్శలపై మాధవి లత స్పందిస్తూ..వీడియో అసంపూర్తిగా ఉందన్నారు. వీడియో కారణంగా ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమాపణనలు కోరుతున్నానని ఆమె అన్నారు.

ఇది కూడా చదవండి: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల ఫలితాలు..భారత్ కు షాక్..?

Latest News

More Articles