Sunday, May 19, 2024

ఈ ఏడాది నుంచే బుక్స్ చూసి పరీక్షలు రాయొచ్చు

spot_img

సీబీఎస్ఈ అధికారులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. పుస్తకాలను చూసి పరీక్షలు రాసే పద్ధతిని ఈ ఏడాడి నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎంపిక చేసిన కొన్ని స్కూళ్లలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టబోతున్నారు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ విధానం ద్వారా పరీక్షలను నిర్వహించబోతున్నారు.

9, 10 తరగతుల్లో ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులు… 11, 12 తరగతుల్లో ఇంగ్లీష్, బయాలజీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో ఓపెన్ బుక్ ఎగ్జామ్స్ ను ప్రవేశపెడుతున్నారు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ పరీక్షల్లో… విద్యార్థులకు పరీక్ష రాయడానికి ఎంత సమయం పడుతుందన్న విషయాన్ని నిపుణులు గమనించనున్నారు. అంతేకాదు ఈ పరీక్షా విధానంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించనున్నారు.

ఓపెన్ బుక్ ఎగ్జామ్ పద్ధతిలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు పుస్తకాలు, అధ్యయన సామాగ్రిని తీసుకెళ్లవచ్చు. వాటిని చూస్తూ ప్రశ్నలకు సమాధానాలు రాయొచ్చు. అయితే పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు కూడా విద్యార్థి సమస్య పరిష్కార శక్తి, సృజనాత్మకత, తార్కిక ఆలోచనా పద్ధతిని బేరీజు వేసేలా ఉంటాయి.

2014 నుంచి 2017 వరకు ఓపెన్‌ బుక్‌ పద్ధతితో ప్రయోగాలు చేసినా వాటిపై ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమెరికా కాలేజీల్లో ప్రవేశం పొందాలంటే అడ్వాన్స్ డ్‌ ప్లేస్‌మెంట్‌ (ఏపీ) పరీక్షలు రాయాలి. ఆ పరీక్షా పత్రాల్లో ఇచ్చే ప్రశ్నలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఏపీ ప్రశ్నలను పరిశీలించి ఓపెన్‌ బుక్‌ పరీక్షా పద్ధతి ప్రవేశపెట్టాలని ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ జ్యోతి శర్మ సూచించారు.

ఇది కూడా చదవండి: బీటెక్ అర్హ‌త‌తోఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 490 పోస్టులు..దరఖాస్తు చేసుకోండి

Latest News

More Articles