Friday, May 17, 2024

తెలంగాణ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల బృందం సమావేశం

spot_img

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ.. కేంద్ర ఎన్నికల బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు ఎన్నికల బృందం.. ఎంసీహెచ్ఆర్డీలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైంది. సమస్యాత్మక ప్రాంతాలు, స్ట్రాంగ్ రూమ్స్, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో పాటించాల్సిన విధివిధానాలపై అవగాహన కల్పించారు. ఓటర్ల జాబితా, తప్పుల సవరణపై కేంద్ర ఎన్నికల బృందం ఆదేశాలు జారీ చేసింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం.. ఏయే ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువ నమోదు అవుతుందో ఆ ప్రాంతాలను గుర్తించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అదేవిధంగా యువతను ఓటింగ్‎లో పాల్గొనే విధంగా అవగాహన కల్పించాలని సూచించింది.

Latest News

More Articles