Sunday, May 19, 2024

కేంద్ర పోలీసు బలగాలకు కీలక హెచ్చరికలు..!

spot_img

న్యూఢిల్లీ: ఇటీవల సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంస్థలు చేపట్టిన పరిశీలనలో.. కొందరు భద్రతా సిబ్బంది యూనిఫామ్‌లో తమ వీడియోలను లో షేర్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేంద్ర పోలీసు బలగాలు తమ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశాయి. సీఆర్‌పీఎఫ్‌, బీఎస్ఎఫ్‌, ఐటీపీబీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

ఆన్‌లైన్‌ స్నేహాల జోలికి వెళ్లొద్దని, సోషల్ మీడియాలో రీల్స్‌ వంటివి చేయొద్దని హెచ్చరించాయి. వీటి వల్ల హానీట్రాప్‌ ముప్పు పెరుగుతుందని, తద్వారా సున్నితమైన సమాచారం శత్రువులకు చేరుతుందని పేర్కొన్నాయి. సున్నితమైన లొకేషన్లలో దిగిన ఫొటోలను షేర్‌ చేయడం కూడా చేయొద్దని తెలిపింది. గైడ్ లైన్స్ ను ఉల్లంఘిస్తే తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని భద్రతా సంస్థలు హెచ్చరించాయి.

Latest News

More Articles