Tuesday, May 7, 2024

బతుకమ్మ, బోనాలతో మంత్రి హరీష్ రావుకి ఘన స్వాగతం

spot_img

సిద్దిపేట నియోజకవర్గం సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామంలో మంత్రి హరీష్ రావుకి డప్పు చప్పుళ్ళతో.. బతుకమ్మ , బోనాలతో ఘన స్వాగతం పలికారు గ్రామస్థులు. అయితే కాసేపు సరదాగా గుర్రం బండి ఎక్కి గ్రామంలోనీ ప్రజలకు అభివాదం చేశారు మంత్రి హరీష్ రావు.. బీఆర్ఎస్ పార్టీకే తమ ఓటు అంటూ మంత్రికి ఏకగ్రీవ తీర్మాన పత్రాలు సైతం పలు కుల సంఘాల నాయకులు, గ్రామస్థులు అంజేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల కోసం గ్రామానికి వచ్చిన తనకు ఏకగ్రీవ తీర్మానం అందించిన గ్రామస్తులు.. గ్రామం చిన్నదైనా మీ మనసు పెద్దది అని నిరూపించుకున్నారు.. రాంపూర్ గ్రామ ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ఏకగ్రీవ తీర్మానం చేసి మద్దతు తెలపడం సంతోషం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడవసారి సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చిన తర్వాత వచ్చిన మొట్టమొదటి గ్రామం రాంపూర్ గ్రామం.

కాలేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత చిన్న గ్రామమైన రాంపూర్ లో యాసంగి పంట 18 లారీల ధాన్యం పండించారు. మూడు గంటల కరెంటు చాలు అంటున్న తెలివితో మాట్లాడుతున్నారా లేదా మీరే ఆలోచించాలి. తెలంగాణ వచ్చిన తర్వాత సాగునీటికి తాగునీటికి ఇబ్బందులు తప్పాయి. గతంలో ఎండాకాలం వచ్చిందంటే రాంపూర్ గ్రామంలో బోరు బండ్ల మోత మోగేది’ అని అన్నారు హరీష్ రావు.

Latest News

More Articles