Sunday, May 19, 2024

లఖ్​నవూపై సునీల్ నరైన్ విధ్వంసం..తన ఖాతాలో మరో రికార్డ్.!

spot_img

కోల్ కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ లఖ్ నవూపై చెలరేగిపోయాడు. ఈ మ్యాచులో నరైన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే బౌండరీలే లక్ష్యంగా లక్ నవూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఏకంగా 228.7 స్టైక్ రేట్ తో 39బంతుల్లో 81 పరుగులతో సత్తా చాటాడు. అందులో 6 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. ఈ నేపథ్యలో నరైన్ ఐపీఎల్లో మరో రికార్డును క్రియేట్ చేశాడు.

నరైన్ ప్రస్తుతం ఐపీఎల్ కెరీర్ లో 1507 పరుగులు, 176 వికెట్లు ఉన్నాయి . నరైన్ కంటే ముందు రవీంద్ర జడేజా ఈ ఘనత సాధించాడు. ( 2894 పరుగులు, 160వికెట్లు, డ్వేన్ బ్రావో 1560 పరుగులు 183 వికెట్లు)

ప్రస్తుత సీజన్ లో నరైన్ కేకేఆర్ కు కీలక బ్యాటర్ గా ఉన్నాడు. మెరుపు ఇన్నింగ్స్ తో కోల్ కతా కు మంచి ఆరంభాలు ఇస్తున్నాడు నరైన్. ఈ క్రమంలో ప్రస్తుత సీజన్ లో 11 మ్యాచులు ఆడిన నరైన్ 183 స్ట్రైక్ రేట్, 41,91 సగటున ఇప్పటివరకు 461 పరుగులు నమోదు చేసాడు. అందులో 46ఫోర్లు, 32 సిక్సులు ఉన్నాయి. ఇక అత్యధిక పరుగుల జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతున్నాడు నరైన్.

ఇది కూడా చదవండి: కన్న కొడుకుపై మరుగుతున్న నూనె పోసి చంపిన తల్లి.!

Latest News

More Articles