Sunday, May 19, 2024

డిగ్రీ అర్హతతో 506 అసిస్టెంట్ కమాండెంట్​ పోస్టులు..!

spot_img

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 506 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎంపికైన అభ్యర్థులు సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటెన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమా బల్ ల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు:
బీఎస్​ఎఫ్​ – 186 పోస్టులు
సీఆర్​పీఎఫ్​ – 120 పోస్టులు
సీఐఎస్​ఎఫ్ – 100 పోస్టులు
ఐటీబీపీ – 58 పోస్టులు
ఎస్ఎస్​బీ – 42 పోస్టులు
మొత్తం పోస్టులు – 506

అర్హతలు:
అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి బ్యాచులర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయస్సు:
అభ్యర్థుల వయస్సు 20 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. అయితే రిజర్వేషన్ ఉన్నవాళ్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:
అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.200 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం:
అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహించి..ఇందులో ఉత్తీర్ణులైనవారికి ఫిజికల్​ ఎఫీషియెన్సీ టెస్ట్​ (పీఈటీ), ఫిజికల్ మెజర్​మెంట్​ టెస్ట్​ (పీఎంటీ) చేస్తారు. చివరిగా ఇంటర్వ్యూ చేసి, అర్హులైన అభ్యర్థులను అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు సెలక్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం:
-అభ్యర్థులు ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
– మీ పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్​ తదితర వివరాలు నమోదు చేసిన తర్వాత రిజిస్ట్రర్ చేసుకోవాలి
-అప్పుడు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ నంబర్​, పాస్​వర్డ్ క్రియేట్ అవుతాయి. వాటితో లాగిన్ కావాలి.
-యూపీఎస్సీ సీఏపీఎఫ్ దరఖాస్తుకు లింక్​ను ఓపెన్ చేయాలి.
-మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
-మీ ఫొటో, సిగ్నేచర్​లను కూడా నిర్దేశిత ఫార్మాట్​లో అప్ లోడ్ చేయాలి.
-అప్లికేషన్ ఫీజు కూడా ఆన్ లైన్ విధానం ద్వారా చెల్లించాలి.
-అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకుని, అప్లికేషన్ సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.
-భవిష్యత్ రిఫరెన్స్​ కోసం అప్లికేషన్​ ప్రింట్​అవుట్​ను తీసుకుని మీ వద్ద భద్రంగా ఉంచుకోవాలి

ముఖ్యమైన తేదీలు:
-దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 ఏప్రిల్​ 24
-దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 మే 14
-అప్లికేషన్ కరెక్షన్​ తేదీలు : 2024 మే 15 నుంచి 21 వరకు
-పరీక్ష తేదీ : 2024 ఆగస్టు 4

ఇది కూడా చదవండి: లఖ్​నవూపై సునీల్ నరైన్ విధ్వంసం..తన ఖాతాలో మరో రికార్డ్.!

Latest News

More Articles