Sunday, May 19, 2024

మాకు ఉచిత బస్సులు వద్దే వద్దు..కాళ్లు, చేతులు విరుగుతున్నాయ్.!

spot_img

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు అరిగోస పడుతున్నారు. పనికిరాని పథకాల పేర్లు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసేఎత్తడం లేదు. ముఖ్యంగా మహిళల కోసం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సుపై తీవ్ర విమర్శలు ఎదరవుతున్నాయి. ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా తీసువచ్చిన ఈ పథకంతో ఎంతోమంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డు పడ్డాయి. ఉపాధిలేక మరేంతో మంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఫ్రీ జర్నీ వల్ల మహిళలు హ్యాపీగా ఉన్నారంటే అదీ లేదు. సీట్ల కోసం మహిళలు జట్లుపట్టుకోని కొట్టుకుంటున్నారు. బస్సు ఎక్కాలంటే డ్రైవర్ భయంతో వణికిపోతున్నారు. కిటికీల నుంచి దూకేస్తున్నారు.

ఇక సరిపడా బస్సులు లేక..ఉన్నవి కూడా సరిగ్గా రాక ఫ్రీ జర్నీ అనేసరికి ఆర్టీసీ సిబ్బందిచిన్నచూపు చూడటం వంటి ఎన్నో సమస్యలతో మహిళలు విలవిల్లాడుతున్నారు. రోజు రోజుకు ఫ్రీ బస్సు వద్దనే వారి సంఖ్య పెరిగిపోతుంది. అందులో మహిళలే ముందుండి ఈ ఫ్రీ జర్నీ మాకొద్దని చెప్పడం గమనార్హం. తాజాగా సూర్యపేట జిల్లాలో కొంతమంది మహిళలు ఫ్రీ బస్సు వద్దని నినదించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి భార్య సునీతా రెడ్డి సూర్యాపేటలో ప్రచారం నిర్వహిస్తుండగా కొంతమంది మహిళలు తనను కలిసి బాధలు చెప్పుకున్నారు. ఉచిత బస్సు వల్ల తమ కాళ్లు, చేతులు విరుగుతున్నాయంటూ ఆవేదన చెందారు. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు పెన్షన్ సమయానికి వచ్చేది. మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ కే ఓటేస్తామని చెప్పారు. ఇప్పటికైన ప్రభుత్వం ఫ్రీ బస్సు జర్నీపై ఓసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: 10సీట్లలో బీఆర్ఎస్ ను గెలిపిస్తే..6నెలల్లో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే స్థాయికి వస్తారు.!

Latest News

More Articles