Sunday, May 19, 2024

10సీట్లలో బీఆర్ఎస్ ను గెలిపిస్తే..6నెలల్లో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే స్థాయికి వస్తారు.!

spot_img

ఈ లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 10 నుంచి 12 ఎంపీ సీట్లు కట్టబెట్టినట్లయితే రాబోయే 6 నెలల్లో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే స్థాయికి తప్పక వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో నుంచి 16 జిల్లాలను తీసేయ్యాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. కరీంనగర్ లోకసభ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ కు మద్దతుగా సిరిసిల్లలో కేటీఆర్ రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

బీజేపీ నేతలు పదే పదే నమో అంటున్నారని ఆరోపించారు. నమో అంటే నరేంద్ర మోదీ కాదని నమో అంటే నమ్మించి మోసం చేయడం కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్లు పేదలను పీడించి పెద్దలకు లబ్దిచేకూర్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పెట్రోల్, డీజిల్ పై పన్నుల రూపంలో 10ఏండ్లలో రూ. 30లక్షల కోట్లు వసూలు చేశారని అన్నారు. అదానీ, అంబానీలకు రూ. 14.5లక్షల కోట్లు రుణమాఫీ చేశారని ఆరోపించారు. తాను చెప్పింది అబద్దమని నిరూపిస్తే రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని సవాల్ చేశారు.

ఇది కూడా చదవండి: పదిగంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్..!

Latest News

More Articles