Sunday, May 19, 2024

జూమ్ మీటింగ్‎లో చూసి అమెరికా నుంచి వచ్చి మహిళా ఉద్యోగిని వేధించిన సీఈఓ

spot_img

జూమ్ మీటింగ్‎లో చూసి ఉద్యోగినిపై మనసు పారేసుకున్న ఓ కంపెనీ సీఈవో.. ఏకంగా అమెరికా నుంచి ఇండియాకు వచ్చి ఆమెను వేధించాడు. ఆ యువతికి ఫిర్యాదు మేరకు సదరు సీఈఓ మీద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: హరీశ్ రావును చూసి తమ బాధ వెల్లగక్కిన ఆటోడ్రైవర్లు

అమీర్‏పేట్‎లోని ఇన్ఫో గ్రావిటీ కంపెనీలో హెచ్ఆర్ అండ్ లీగల్ మేనేజర్‎గా ఓ యువతి (28) పని చేస్తుంది. ఆ కంపెనీ సీఈవో చంద్ర అమెరికాలో నివాసముంటున్నాడు. అయితే కంపెనీ ఉద్యోగులతో తాజాగా సీఈఓ జూమ్ మీటింగ్ నిర్వహించాడు. ఆ మీటింగ్ లో సదరు యువతిని యువతి అందాలను ఆయన పొగిడేవాడు. అయితే చంద్ర కంపెనీ సీఈఓ కావడంతో అతన్ని మందలించలేకపోయేది. దాన్ని అలుసుగా తీసుకున్న చంద్ర మరింతగా రెచ్చిపోయేవాడు. గత డిసెంబర్ 22న అమెరికా నుంచి హైదరాబాద్‎కు వచ్చిన చంద్ర.. అమీర్ పేట్ కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేశాడు. మీటింగ్ అనంతరం ఆ యువతిని నెక్లెస్ రోడ్డులోని రెస్టారెంట్‎కు తీసుకెళ్లిన చంద్ర.. తన మనస్సులోని మాటను బయటపెట్టాడు. అందుకు ఆమె తిరస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఐదు రోజుల పాటు ఆఫీసుకు సెలవుపెట్టింది. తర్వాత జనవరి 8న డ్యూటీకి వచ్చిన యువతిని.. చంద్ర లైంగికంగా వేధించాడు. దీంతో జనవరి 12న తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. రిలీవింగ్ లెటర్, ఎక్స్‎పీరియన్స్ లెటర్, జీతం, లీగల్ సర్వీసెస్ చార్జెస్ డ్యూస్ ఇవ్వాలని తెలిపింది. తన కోరిక తీరిస్తేనే అవన్నీ ఇస్తానని కంపెనీ సీఈవో చంద్ర మొండికేయడంతో ఇక చేసేదిలేక మధురానగర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles