Monday, May 20, 2024

TSPSC పేపర్‌ లీకేజీ కేసు: శంకర్ లక్ష్మి అరెస్టుకు రంగం సిద్ధం!

spot_img

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) పేపర్‌ లీకేజీ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. లీకేజీలో కమిషన్‌ కాన్ఫిడెన్షియల్‌ విభాగం ఇన్‌చార్జ్ గా ఉన్న శంకర్‌ లక్ష్మి పాత్రపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పేపర్‌ లీకేజీ అంశంలో ఆమె ప్రమేయం ఉన్నట్లుగా నిర్ధారణకు వచ్చిన సిట్‌ ఒకటి, రెండు రోజుల్లో ఆమెను కూడా అరెస్ట్‌ చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. శంకర లక్ష్మి వ్యవహారంలో సిట్‌ అధికారులు కీలక సమాచారంతో పాటు..కాల్‌ డేటా వివరాలను సేకరించినట్టు.. అత్యంత విశ్వసనీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే లీకేజీలో ఆమె పాత్ర ఉండొచ్చని చెబుతున్నారు.

అంతేకాదు..డీఏఓ పరీక్ష టాప్ స్కోరర్లు గా ఉన్న రాహుల్,శాంతి, సుచరిత లను విచారిస్తోంది సిట్. నిందితులను విచారించేందుకు 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది కోర్టు. చంచల్ గూడ నుండి నిందితులను కస్టడీని తీసుకున్న సిట్ అధికారులు. మరో వైపు సిట్ ముందు విచారణకు హజరు కానున్నారు రేణుక.

ఇప్పటికే 37 మందిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు..మరికొంత మందికి పరీక్ష కంటే ముందే  పేపర్ వెళ్లినట్టు గుర్తించారు. అరెస్ట్ ల సంఖ్య 50 కి చేరుకునే అవకాశముంది.

Latest News

More Articles