Saturday, May 18, 2024

హైదరాబాద్‎లో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ హల్చల్

spot_img

నగరంలో చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హల్చల్ చేస్తోంది. తాజాగా రామచంద్రాపురం, మియాపూర్‎లో చెడ్డీ గ్యాంగ్ కదలికలు బయటపడ్డాయి. ఐదుగురు సభ్యులు గల చెడ్డీ గ్యాంగ్.. మియాపూర్‎లోని వసంత విల్లాలోకి చొరబడినట్లు స్థానికులు గుర్తించారు. చెడ్డీ గ్యాంగ్ తమ విల్లాలోకి ప్రవేశించి, సంచరిస్తుండగా సీసీ కెమెరాలలో కనిపెట్టారు. తాళం వేసి ఉన్న విల్లాలోకి చొరబడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. మాదాపూర్ ఎస్వోటీ, సీసీఎస్ క్రైమ్ బృందాలు చెడ్డి గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. మియాపూర్, రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles