Saturday, May 18, 2024

12 ఏండ్ల సెంటిమెంట్ కలిసొస్తే.. ఐపీఎల్ 2023 ట్రోఫీ గెలిచేది చెన్నై..!

spot_img

ఐపీఎల్ 16వ సీజ‌న్ ఎవరనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది. డిఫెండింగ్ చాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్ రెండోసారి ట్రోఫీని ముద్దాడుతుందా?.. ప‌దోసారి ఫైన‌ల్ చేరిన చెన్నై సూప‌ర్ కింగ్స్,  ఐదోసారి క‌ప్పును ఎగ‌రేసుకుపోతుందా? అనే ఆస‌క్తి దేశవ్యాప్తంగా నెలకొన్నది.

ఇక గత రికార్డులు, సెంటిమెంట్ల విషయానికొస్తే.. క్వాలిఫైయ‌ర్ 1గా ఫైన‌ల్‌కు దూసుకెళ్లిన జ‌ట్టే అత్య‌ధికంగా 9 సార్లు ఐపీఎల్ ట్రోఫీని చేజిక్కించుకున్నాయి. 2011 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 9 సార్లు.. క్వాలిఫైయ‌ర్ 1గా నిలిచిన జట్టే  తుది విజేతగా నిలిచి  ట్రోఫీని సొంతం చేసుకుంది. కేవ‌లం మూడు సార్లు మాత్ర‌మే క్వాలిఫైయ‌ర్2గా నిలిచిన జట్టే చాంపియ‌న్‌గా నిలిచింది.

 2011 నుంచి ఐపీఎల్ విజేతలు

2022 –  క్వాలిఫైయ‌ర్ 1లో గెలిచిన గుజ‌రాత్ టైటాన్స్ ఫైన‌ల్లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ను ఓడించి ట్రోఫీని చేజిక్కించుకుంది.

2021 –ఫైన‌ల్లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌ను చిత్తు చేసి చెన్నై సూప‌ర్ కింగ్స్ ట్రోఫీ అందుకుంది.

2020 – ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ముంబై ఇండియ‌న్స్‌ 5వ సారి ట్రోఫీని సొంతం చేసుకుంది.

2019 – ఫైన‌ల్లో చెన్నై సూప‌ర్ కింగ్స్ పై ముంబై ఇండియ‌న్స్‌ గెలిచింది.

2018 –ఫైన‌ల్లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై చెన్నై సూప‌ర్ కింగ్స్‌ గెలిచింది.

2017 –ఫైన‌ల్లో రైజింగ్ పూణే సూప‌ర్ జెయింట్స్‌పై ముంబై ఇండియ‌న్స్‌ గెలిచి ట్రోఫీ అందుకుంది.

2016 – ఫైన‌ల్లో బెంగళూరుపై స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ విజయం సాధించి తొలిసారి క‌ప్పు కొట్టింది.

2015 – ఫైన‌ల్లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను ముంబై ఇండియ‌న్స్‌ ఓడించింది.

2014 –ముంబై ఇండియ‌న్స్‌పై కోల్‌క‌తా నైట్ రైడర్స్ గెలుపొందింది.

2013 – ఫైన‌ల్లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను ముంబై ఇండియ‌న్స్‌ ఓడించింది.

2012 –చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను కోల్‌క‌తా నైట్ రైడర్స్ ఓడించింది.

2011 – ఆర్సీబీపై చెన్నై సూప‌ర్ కింగ్స్ విజయం సాధించింది.

Latest News

More Articles