Saturday, May 11, 2024

స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు ‘దామ్‌ వైరస్‌’ ముప్పు..?

spot_img

హైదరాబాద్: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు దామ్‌ వైరస్‌ ముచ్చెమటలు పట్టిస్తున్నది. మొబైల్‌లోని ఒరిజినల్‌ డేటాను కూడా డిలీట్‌ చేయడం ఈ వైరస్ ప్రత్యేకత. ఈ వైరస్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని జాతీయ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరికలు జారీ చేసింది.

దామ్‌ వైరస్‌ అనేది ర్యాన్సమ్‌వేర్‌. మొబైల్‌లోకి ప్రవేశించగానే సెక్యూరిటీ చెక్‌ను ఏమార్చి మొబైల్‌ను తన ఆధీనంలోకి తీసుకుంటుంది. బ్రౌజింగ్‌ హిస్టరీ, బుక్‌మార్క్స్‌, గ్యాలరీలలోని డేటా, ఫోన్‌బుక్‌, కాల్‌ రికార్డింగ్‌, ఎస్‌ఎంఎస్‌లను హ్యాక్‌ చేసి అందులోని కీలక సమాచారాన్ని దొంగిలిస్తుంది.

ఈ మాల్‌వేర్‌ బారిన పడకుండా ఉండాలంటే ప్లే స్టోర్‌ నుంచి మాత్రమే యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని జాతీయ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సూచించింది. అన్‌ట్రస్ట్‌డ్‌, అశ్లీల వెబ్‌సైట్లకు దూరంగా ఉండాలి. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన మెసేజ్‌ల్లోని లింక్స్‌, అటాచ్‌మెంట్స్‌ అస్సలు ఓపెన్‌ చేయకూడదన్నారు.

ముఖ్యంగా bit.ly, tinyurl వంటి షార్ట్‌ యూఆర్‌ఎల్‌తో వచ్చే లింక్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సేఫ్ బ్రౌజింగ్‌ టూల్స్‌ వాడుతూ.. ఫైర్‌వాల్‌, ఫిల్టరింగ్‌ సర్వీస్‌లను ఎనేబుల్‌ చేసుకోవాలని జాతీయ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది.

Latest News

More Articles