Saturday, May 18, 2024

యాపిల్ కంపెనీకి షాక్.. ఐ ఫోన్ వాడకాన్ని నిషేధించిన చైనా

spot_img

ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‎కి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ప్రతి ఒక్కరూ తమ చేతిలో ఐఫోన్ ఉండాలని కోరుకుంటారు. వినియోగదారుల ఇష్టానికనుగుణంగా యాపిల్ కంపెనీ ఇప్పటివరకు ఐఫోన్ 14 సిరీస్ వరకు విడుదలచేసింది. త్వరలోనే ఐఫోన్ 15 సిరీస్ విడుదల చేయనుంది. ఈ సిరీస్ విడుదలకు ముందు యాపిల్ కంపెనీకి చైనా గట్టి షాకిచ్చింది. చైనా ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఐఫోన్ వాడకూడదని ఆంక్షలు పెట్టింది.

చైనా నాసిరకం వస్తువులను తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తుంటుంది. అటువంటి చైనా విదేశాలలో తయారైన ఐఫోన్లను వాడొద్దనడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఐఫోన్స్ మాత్రమే కాకుండా విదేశీ బ్రాండ్ ఫోన్స్ వినియోగాన్ని కూడా నిషేదించినట్లు తెలుస్తోంది. భద్రతాపరమైన సమస్యలు రాకూడదనే చైనా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే చైనా ప్రభుత్వం విధించిన ఈ రూల్ ఎంతవరకు అమలవుతుందనేది తెలియాల్సి ఉంది. విషయం మీద యాపిల్ కంపెనీ స్పందించకపోవడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ 15 సిరీస్ విడుదలకు ముందు చైనా తీసుకున్న ఈ నిర్ణయం వాటి అమ్మకాలను దెబ్బ తీస్తుందని బిజినెస్ ఎనలిస్టులు భావిస్తున్నారు.

Latest News

More Articles