Wednesday, May 22, 2024

మూడో పెళ్లి.. శ్రీజ హింట్ ?

spot_img

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల తన భర్త కళ్యాణ్ దేవ్ నుండి విడిపోయినట్లు ఎప్పటినుండో జరుగుతున్న ప్రచారం నిజమేనని వార్తలొస్తున్నాయి. గత జనవరి నుంచి విడివిడిగా ఉంటున్నామని.. ఇక ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీజ, కళ్యాణ్ లు సోషల్ మీడియాలో చెప్పకనే చెప్పేశారు. శ్రీజ అయితే తన జీవితంలోకి కొత్త వ్యక్తి ప్రవేశించాడని బాహాటంగా కామెంట్స్ చేసేసింది.

న్యూ ఇయర్ సందర్భంగా గత ఏడాది జరిగిన మూమెంట్స్ ని షేర్ చేస్తూ..” డియర్ 2022, నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిని కలిసేలా చేసావు.. నా గురించి బాగా తెలిసిన వ్యక్తి.. నన్ను అమితంగా ప్రేమిస్తూ.. కేరింగ్ గా చూసుకుంటూ కష్టసుఖాలలో నాకు తోడుండే వ్యక్తి.. ఎప్పుడు నాకు సపోర్టుగా నిలబడే వ్యక్తి..ఇతడిని కలుసుకోవడం అద్భుతం.. ఇక కొత్త ప్రయాణం మొదలవుతుంది..” అంటూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది శ్రీజ.

ఇక ఇప్పుడు శ్రీజ రెండు సార్లు విడాకులు తీసుకుని ఇప్పుడు తన ఇద్దరు కూతుళ్లకు ఒంటరి తల్లిగా ఉంటుంది. అయితే మెగా ఫ్యామిలీ బయటికి చెప్పుకున్నా.. శ్రీజ ఇప్పటికే కళ్యాణ్ దేవ్ కి విడాకులు సైతం ఇచ్చేసినట్టు ప్రచారం జరుగుతుంది. కళ్యాణ్ దేవ్ తో విడిపోవడానికి కారణం ఏంటో ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేకపోయినా.. కళ్యాణ్ దేవ్ వ్యవహారంతో శ్రీజ అడ్జస్ట్ కాలేకపోయిందని ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినపడుతున్న మాట.

Latest News

More Articles