Monday, May 20, 2024

ఆగని ఉద్యోగాల కోత..!!

spot_img

ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాల కోత ఆగడం లేదు. ఫార్మా, టెలి కమ్యూనికేషన్, ఈ కామర్స్, విమానయానం, డెలివరీ, మార్కెటింగ్ ఇలా అన్ని రంగాలకూ విస్తరించింది. దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ 14వందల మంది ఉద్యోగుల తొలగింపునకు రెడీ అయ్యింది. అమెరికాకు చెందిన కమ్యూనికేషన్స్ సంస్థ సిస్కో వేలాదిమందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది.

గడిచిన 2ఏండ్లుగా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా 2023ను ఉద్యోగుల తొలగింపునామ ఏడాది పిలవడానికి కారణం…ఆ ఒక్క ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా 2.62లక్షల మంది టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇందులో 70శాతం కోతలతో అమెరికా తొలిస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో భారత్ ఉంది. ఆ ఏడాది భారత్ 18వేల టెక్ ఉద్యోగుల పోయాయి. ఈ మేరకు లేఫ్ ఫై వెబ్ సైట్ తన రిపోర్టులో వెల్లడించింది. ఇక ఈ ఏడాది కూడా ఉద్యోగాల కోతలు తారాస్థాయికి చేరనున్నట్లు అంచనాలు చెబుతున్నాయి.

ఇది కూడా  చదవండి: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందా? గుండెపోటు కావొచ్చు..!!

Latest News

More Articles