Thursday, May 9, 2024

ఎక్స్ ప్రత్యామ్నాయంగా..బ్లూస్కై..ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..!!

spot_img

ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్ కు ప్రత్యమ్నాయంగా మరో సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం తెరపైకి వచ్చింది. బ్లూస్కై పేరుతో ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సీ ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ప్లాట్‌ఫారమ్ గత ఫిబ్రవరిలో బీటా వెర్షన్‌లో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫారమ్‌కు 3 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు.

అకౌంట్ పోర్టబిలిటీ వంటి వినూత్న ఫీచర్ల్లను ఆఫర్ చేస్తున్న బ్లూస్కై ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్ కు ప్రతిరూపమే. ఈ యాప్ దాదాపు ఎక్స్ మాదిరిగానే పనిచేసే బ్లూస్కైకి సొంతంగా ఓ ప్రత్యేకత ఉంది. లేబులింగ్ సర్వీస్ లాంటి ఫీచర్లు ప్రవేశపెట్టాలని ఈ ప్లాట్ ఫాం యోచిస్తోంది. కంటెంట్ ను మోడరేట్ చేసేందుకు వినియోగదారులు, సంస్థలు లేబుల్స్ ను రూపొందించేందుకు ఈ ఫీచర్ అనుమతిస్తుంది.

ఇప్పుడు వినియోగదారులందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది iOS, Android రెండింటిలోనూ అందుబాటులో ఉంది. దానిలోకి లాగిన్ అవ్వడానికి, ఒక IDని క్రియేట్ చేయాలి. దీని కోసం ఇ-మెయిల్, ఫోన్ నంబర్ అవసరం ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఆగని ఉద్యోగాల కోత..!!

Latest News

More Articles