Friday, May 17, 2024

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ.. సిద్దిపేట గడ్డపై సీఎం కేసీఆర్‌ ఎమోషనల్

spot_img

సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు పెంచిన గడ్డ నా సిద్దిపేట గడ్డ అని సీఎం కేసీఆర్‌ ఎమోషనల్ అయ్యారు. ఈ సిద్దిపేట గడ్డ నన్ను సాదింది. చదువు చెప్పింది. నాకు రాజకీయ జన్మనిచ్చింది. నన్ను నాయకున్ని చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు పెంచిన గడ్డ నా గడ్డ అని కేసీఆర్ అనారు. సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.

Also Read.. ఆపద మొక్కలోళ్లు వచ్చిండ్రు.. రైతులు అప్రమత్తంగా ఉండాలి

‘‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ.. సిద్దిపేట పేరు విన్నా.. సిద్దిపేట భూమికి వచ్చినా.. సిద్దిపేట నా మనసులో ఈ పాటే గుర్తుకువస్తుంది.తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా యావత్‌ దేశమే ఆశ్చర్యపడేలా.. అనేక రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నా అంటే ఈ గడ్డ నుంచి నాకు దొరికిన రక్తం, మాంసం, బుద్ధి, బలం ఈ గడ్డ పుణ్యమే. కొండంరాజ్‌పల్లి మాదన్న ఎక్కడ ఉన్నడో.. మా నవాబ్‌ సాబ్‌ ఎక్కడ ఉన్నాడో. నాకు డిపాజిట్‌ కట్టే తోర్నాల చంద్రారెడ్డి బావ ఎక్కడ ఉన్నడో. ఇలా అనేక మంది అనేక మంది ప్రతి గ్రామంలో వంద, మూడు వందల పేర్లు పెట్టి పిలిచేంత అభిమానం కలిగిన గడ్డ సిద్దిపేట గడ్డ.

Also Read.. ఆ చీర‌ల‌ను తీసుకుపోయి కాల‌వెడతారా? నేత‌న్నల క‌న్నీళ్లు తుడిచే గొప్ప ప‌థ‌కం అది

సిద్దిపేటలో మంచినీళ్ల కరువు వస్తే వార్డుకో ట్యాంకు పెట్టి.. మిత్రులను వెంటేసుకొని బయలుదేరాం. సాయంత్రం వరకు ప్రయత్నం చేసి వంద బోర్లు వేస్తే నీళ్లు రాలే. ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటే బాధేస్తుంది. మంచినీళ్ల కోసం సిద్దిపేట పడ్డ తిప్పలు. లోయర్‌ మానేరు నుంచి నీళ్లు తెచ్చుకొని జలజాతర చేసుకున్నాం. ఈ రోజు మిషన్‌ భగరీథ తెలంగాణ మొత్తం అమలవుతుందంటే.. సిద్దిపేట మంచినీళ్ల పథకమే దానికి పునాది. ఇక్కడి అనుభవమే అక్కడిదాకా.. బ్రహ్మాండంగా పని చేసింది.’’ అని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

Latest News

More Articles