Thursday, May 2, 2024

మా అక్క ఆత్మ‌హ‌త్య‌కు శివ‌రామే కార‌ణం

spot_img

మా అక్క ప్ర‌వ‌ళిక ఆత్మ‌హ‌త్య‌కు శివ‌రామే కార‌ణం అని ఆమె తమ్ముడు కుమార్ స్ప‌ష్టం చేశారు. మాకు న్యాయం జ‌ర‌గాలంటే అత‌న్ని శిక్షించాల‌ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కానీ, ఏ ఇత‌ర పార్టీలు కూడా మా ఇంటికి రావొద్దు.. మమ్మ‌ల్ని రాజ‌కీయాల్లోకి లాగొద్ద‌ని కుమార్ విజ్ఞ‌ప్తి చేశారు.

అక్క హాస్ట‌ల్‌కు నేను కొంచెం దూరంలోనే ఉంటాను. ఐదు నిమిషాల్లోనే అక్క హాస్ట‌ల్‌కు చేరుకుంటాను. వారానికి మూడు నాలుగు సార్లు కలిసి మాట్లాడుకుంటాం. ముఖ్యంగా అక్క ప్రవళిక చనిపోవడానికి కారణం శివరామ్ అనే వ్యక్తి. వేరే అమ్మాయి వల్ల పరిచయం అయ్యాడు. అప్పటి నుండి అక్కకి ఇష్టం లేకపోయినా తనతో మాట్లాడడం, కాల్ చెయ్యడం, హాస్టల్‌కు వచ్చి అందరి ముందు మాట్లాడమని ఇబ్బంది పెట్టడం వల్ల, అక్కకు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆఖరికి అమ్మకు, నాన్నకు , నాకు.. ఎవరికి చెప్పిన ఏమంటారో, ఏం స‌మ‌స్య‌ వస్తుందో ఇంట్లో అని చాలా డిప్రెష‌న్‌లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంది. ముఖ్యంగా అక్క చనిపోవడానికి కారణం హాస్టల్ దగ్గర చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏడిపించడం, కాల్ చెయ్యడం, ఫ్రెండ్స్ ఫోన్ నుండి ఇలా వేరే వేరే నెంబర్స్ నుండి కాల్ చేయడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక సూసైడ్ చేసుకుంది. అక్కకి ఇప్పుడు న్యాయం జరగాలంటే శివ‌రామ్‌ని ఎక్కడ ఉన్న పట్టుకుని తన అక్క చనిపోయిన్నట్టుగా ఉరి గానీ, ఎన్‌కౌంటర్ గానీ చేసి ప్రభుత్వం మాకు న్యాయం చేయ్యాలి. ప్రభుత్వం, కేసీఆర్ చేశార‌ని చెప్తున్నారు కానీ వారు చేయ‌లేదు. మాకు న్యాయం జ‌ర‌గాలంటే వాడిని శిక్షించాల‌ని కుమార్ డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: ఆనాడు సిరిసిల్లలో నేత‌న్నల ఆత్మ‌హ‌త్య‌లు చూసి చ‌లించిపోయాను

Latest News

More Articles