Friday, May 17, 2024

ఆనాడు సిరిసిల్లలో నేత‌న్నల ఆత్మ‌హ‌త్య‌లు చూసి చ‌లించిపోయాను

spot_img

రాజ‌న్న సిరిసిల్ల : సిరిసిల్లలో నేత‌న్నలు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌ద్ద‌ని రాసిన రాత‌ల‌ను చూసి చలించిపోయాన‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. స‌మైక్య రాష్ట్రంలో మ‌న‌కు ఎందుకు ఈ బాధ‌లు అని బాధ‌ప‌డ్డామ‌ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. రాజ‌న్న సిరిసిల్ల‌లో ఏర్పాటు చేసిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

Also Read.. టికెట్లు అమ్ముకోలేదని భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిలో ప్రమాణానికి సిద్ధమా?

‘‘నా 70 ఏండ్ల జీవితంలో సిరిసిల్ల‌లో క‌నీసం ఓ 170 సార్లు తిరిగాను. ఇక్క‌డ బంధుత్వాలు, ఆత్మీయ‌త‌లు, ఎంతో మంది నా క్లాస్‌మేట్స్ ఉన్నారు. హెలికాప్ట‌ర్‌లో వ‌స్తుంటే అప్ప‌ర్ మానేరు నుంచి సిరిసిల్ల వ‌ర‌కు ఒక స‌జీవ జ‌ల‌ధార‌గా మారింది. సంతోసంగా ఉంది. స‌మైక్య పాల‌న‌లో దుమ్ములేసే ప‌రిస్థితి ఉండే. పోతుగ‌ల్లు గ్రామం పైన గూడూరు అనే ఊరికి మా అక్క‌ను ఇచ్చాం. అక్క‌డ అప్ప‌ర్ మానేరు కాలువ‌లో నేను ఈత కొట్టాను. నా కండ్ల ముందే పోత‌గ‌ల్లు గ్రామంలో 15 నుంచి 20 రైస్ మిల్స్ వ‌చ్చాయి. స‌మైక్య పాల‌కుల దాడి, దోపిడీ పెరిగాక‌.. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో అవి మాయ‌మైపోయాయి.

Also Read.. ఎన్నికల పాటల సీడీని విడుదల చేసిన మంత్రి హరీష్ రావు

స‌మైక్య రాష్ట్రంలో ఓరోజు మ‌ధ్య రాత్రి సిరిసిల్ల నుంచి హైద‌రాబాద్ వెళ్తున్నాం. ఆత్మ‌హ‌త్య‌లు ప‌రిష్కారం కాదు.. చావ‌కండి అని రాయించారు. ఆ రాత‌లు చూసి క‌న్నీళ్లు పెట్టుకున్నాం. స‌మైక్య రాష్ట్రంలో మ‌న‌కు ఎందుకు ఈ బాధ‌లు అని బాధ‌ప‌డ్డాం. ఇక్క‌డ ఎంపీగా వ‌స్తే ఆద‌రించి గెలిపించారు. ఒక రోజు హైద‌రాబాద్‌లో పేప‌ర్ తిరిగేస్తే ఏడుగురు కార్మికులు చ‌నిపోయారు. ఎంపీగా ఉన్న నేను చ‌లించి, చేనేత పెద్ద‌మ‌న‌షుల‌కు ఫోన్ చేసి ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నాను. పార్టీ డ‌బ్బుల ద్వారా కొంత ఫండ్ స‌మ‌కూర్చి దండం పెడుతా చ‌నిపోవ‌ద్ద‌ను అని వేడుకున్నాను. కానీ పూర్తి రిజ‌ల్ట్ రాలేదు.. కానీ కొంత ఉప‌శ‌మ‌నం ల‌భించింది’’ అని కేసీఆర్ తెలిపారు.

Latest News

More Articles