Friday, May 17, 2024

గచ్చిబౌలిలో కాపు భవనం.. సీఎం కేసీఆర్ పై ఏపీలో ప్రశంశలు

spot_img

కాపు సామాజిక వర్గానికి హైదరాబాద్ మహానగరంలో ఏడెకరాల స్థలాన్ని కేటాయించడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ అన్నారు. జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్ లోని ఆయన నివాసంలో కాపు వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు యాళ్ళ వరప్రసాద్ ఆధ్వర్యంలో కృతజ్ఞత సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కాపు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాపు సంఘాల నాయకులు తోట చంద్రశేఖర్ ను ఘనంగా సన్మానించారు. స్థల కేటాయింపులో తోట చంద్రశేఖర్ కృషి అభినందనీయమని అన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కుల, మతాలకతీతంగా పరిపాలన సాగిస్తూ అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే అడిగిన వెంటనే నగరం నడిబొడ్డున ఉన్న గచ్చిబౌలి ప్రాంతంలో కాపు భవన నిర్మాణానికి స్థలం కేటాయించి తన ఔదార్యాన్ని చాటుకున్నారని అన్నారు. కాపుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్, మినిష్టర్ కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక వర్గానికి చెందిన సమస్యలను ప్రాంతాలకు అతీతంగా అక్కడి పాలకుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవడంలో అందరూ కలిసి రావాలని తోట కోరారు.

Latest News

More Articles