Sunday, May 19, 2024

60 ఏండ్లు అధికారమిస్తే.. కాంగ్రెస్ ఏంజేసింది.. నిప్పులుచెరిగిన కేసీఆర్

spot_img

హుస్నాబాద్: అనతికాలంలోనే అన్ని అడ్డంకులను అధిగమించి అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిపామని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల రాగానే అనేక పార్టీలు వచ్చి.. ఒక్క ఛాన్స్ ఇయ్యమని అడుతారని ఎద్దేవా చేశారు. ఓటు వేసేముందు బాగా ఆలోచన చేయాలి. మన భవిష్యత్ ను మార్చేది ఓటు. అందుకే జాగ్రత్తగా మనకు ఎవరూ బాగు చేస్తారు అనే విషయాలను ఆలోచన చేసి ఓటు వేయాలని సీఎం ప్రజలకు సూచించారు. హుస్నాబాద్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. అంతకుముందు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ మేనిఫెస్టోని విడుదల చేశారు.

Also Read.. రేవంత్ రెడ్డి నన్ను డబ్బులడిగాడు.. నేను ఇవ్వలేదు అందుకే నాపై కక్ష.. రాగిడి తీవ్ర ఆగ్రహం

ఈ సందర్భంగా ఒక్క ఛాన్స్ అంటున్న కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఒక్క ఛాన్సేంటి ఇప్పటికే 10 సార్లు అవకాశమిచ్చినా ఏం చేశారు. దళితుల బతులు 75 ఏండ్లలో ఎందుకు మారలేదు? దీనికంతటికి ఎవరూ కారణం? అని ప్రశ్నించారు. గతంలో మనం 50, 100, 200 పింఛన్లు చూసినం. అప్పుడు పింఛన్లు ఎందుకిస్తరు అని అధికారులను అడిగినా. అంధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఇలా అందరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందన్నారు. అందుకే అధికారులు చెప్పినా వినకుండా 1000 చెసిన. ఇప్పుడే హైదరాబాద్ లో పింఛన్ 5000  చేస్తామని చెప్పి వచ్చినట్లు వివరించారు. కాకపోతే ఒకేసారి పెంచం. అలా చేస్తే అనేక సమస్యలు వస్తాయి. విడతల వారిగా పెంచుకుంటూ పోతామని వివరించారు.

Also Read.. సామాన్య ప్ర‌జ‌ల‌కు ఊర‌ట‌.. రూ.400కే గ్యాస్ సిలిండ‌ర్

రైతుబంధు పెట్టాలని నాకు ఎవరూ చెప్పలే. ఇప్పుడు బ్రహ్మాండగా అమలు చేస్తున్నామని చెప్పారు. గతంలో హుస్నాబాద్ చూస్తే బాధ వేసేది. వాగుల్లో చెక్ డ్యాములు కనిపించేవి కావు. ఇప్పుడు మిషన్ కాకతీయ, చెక్ డ్యామ్ లతో బాగు చేసుకున్నాం. గత ప్రభుత్వాల హయాంలో మోటర్లు కాలిపోవుడు,ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవుడు ఉండే. ఈరోజు ఎక్కడా గలాంటి సమస్యలు లేవు. నాణ్యమైన ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని సీఎం తెలిపారు. హెలికాప్టర్లో వస్తుండగా పొలాలు చూస్తే కడుపునిండింది. ఎటూ చూసిన పచ్చగా కనిపిస్తుంది. అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నామని తెలిపారు.

Also Read.. దేశ రాజ‌ధాని ఢిల్లీలో భూప్ర‌కంప‌న‌లు

ప్రభుత్వం వచ్చాక 6 నెలల్లో కొన్ని కాలువు పూర్తి చేస్తే.. ఇక్కడి రైతులకు ఎదురువుండదు. మహాసముద్రం గండి పూర్తి చేసినం. దాంతో గ్రామాలకు సాగునీరు, తాగునీరు సమస్య తీరింది. పంట విస్తీర్ణం పెరిగింది. రైతుల ఆదాయం పెరిగింది. రైతు కంటినిండ నిద్రపోతుండు. కల్లెలు నిండుగా ఉన్నాయి. నేను ఎక్కడిపోయినా ధాన్యం రాశులు కుప్పలుగా ఉండి.. లక్ష్మి నాట్యం చేస్తుంది. ప్రతి గ్రామానికి మిషన్ భరీర్థ పనిచేస్తుంది. మహిళల బిందెలు పట్టుకుని కనిపిస్తే.. ఎమ్మెల్యే రాజీనామా చేయాలని చెప్పిన. ఈరోజు ఆ సమస్యలు తీరాయని అన్నారు.

Also Read.. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో – 2023

గౌడవెల్లి ప్రాజెక్టు పూర్తికి తాను బాధ్యత తీసుకుంటా. ప్రభుత్వం వచ్చాక దానిని ప్రారంభించడానికి నేనే వస్తా. శనిగారంప్రాజెక్టు కాల్వ పనులు కూడా పూర్తి చేయిస్తం. కట్టలను కూడా బలోపేతం చేస్తం. కొత్తకొండ జాతర జరిగే వీరభద్ర స్వామి ఆలయాన్ని పునరుద్ధరిస్తం. రహదారులను విస్తరిస్తం. ముల్కనూరులో కొత్త బస్టాండును ఏర్పాటు చేయిస్త. కొత్త కాలేజీలనుమంజూరు చేయిస్త. అన్ని వర్గాల ప్రజల బాగు ఎజేండాతో ముందుకుపోతున్నాం. అందరికీ అందుబాటులో ఉండే సతీష్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి. వచ్చే ఎన్నికల్లో 95-105 సీట్లు గెలుస్తాం. అద్భుత మేనిఫెస్టో ప్రకటించాం. దానిని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకుపోవాలి. మనది పేదల ప్రభుత్వం అని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సీఎం సూచించారు. అనంతరం వొడితెల సతీష్ కు సభ సాక్షిగా పార్టీ భీఫాం ను అందజేశారు.

Latest News

More Articles