Sunday, May 19, 2024

ల‌క్ష మెజార్టీతో ఆరూరి ర‌మేశ్ ను గెలిపించాలి.. వ‌ర్ధ‌న్న‌పేట రింగ్ రోడ్డుపై కేసీఆర్ క్లారిటీ    

spot_img

వ‌రంగ‌ల్ : వ‌ర్ధ‌న్న‌పేట రింగ్ రోడ్డు కోసం ల్యాండ్ ఫూలింగ్ చేస్తార‌ని ప‌చ్చి అబ‌ద్దాలు ప్ర‌చారం చేస్తున్నారని ముఖ్య‌మంత్రి కేసీఆర్ మండిప‌డ్డారు.  ఆరూరి ర‌మేశ్‌పై నేరుగా గెలిచే ద‌మ్ము లేనోళ్లు ఈ ప్ర‌చారాలు చేస్తున్నారని, ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి కొంత‌మంది దుర్మార్గులు ప‌చ్చి అబద్దాలు చెబుతున్నారని పేర్కొన్నారు. ఓటు వేసే ముందు ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటేయాలి అని వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ పిలుపునిచ్చారు. వ‌ర్ధ‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్రంస‌గించారు.

Also Read.. విషాదం.. దావత్ లో మటన్ ముక్క తిని.. బాలుడు మృతి

మ‌న‌తో పొత్తు పెట్టుకుని గెలిచి 14 ఏండ్లు ఏడిపించి, యువ‌కుల చావులు చూసి, నేను చావు నోట్లో త‌ల‌కాయ‌పెట్టి ఆమ‌ర‌ణ దీక్ష చేస్తే, అప్పుదు కాంగ్రెస్ పార్టీ దిగివ‌చ్చి రాష్ట్రం ఇచ్చార‌ని కేసీఆర్ గుర్తు చేశారు. ఏ కులాన్ని, వ‌ర్గాన్ని వ‌దిలిపెట్ట‌కుండా.. అంద‌రికీ న్యాయం చేసే దిశ‌గా ముందుకు పోయామని తెలిపారు.  ఆరూరి ర‌మేశ్ ఆధ్వ‌ర్యంలో వ‌ర్ధ‌న్న‌పేట అన్ని రంగాల్లో బ్ర‌హ్మాండ‌మైన అభివృద్ధి సాధించిందని, ఐన‌వోలు, హ‌స‌న్‌ప‌ర్తి మండ‌లాల‌కు దేవాదుల నుంచి నీళ్లు తెచ్చుకుని పండ‌ట‌లు పండించుకుటున్నామని కేసీఆర్ తెలిపారు.

Also Read.. దళితులు, రైతుల ద్రోహిగా కాంగ్రెస్ పార్టీ

ప్ర‌జ‌ల్లో ఉండే మంచి నాయ‌కుడు ఆరూరి ర‌మేశ్. గ‌త రెండు ఎన్నిక‌ల్లో ఒక‌సారి 80 వేలు, ఇంకోసారి 90 వేల మెజార్టీ ఇచ్చి గెలిపించారు. ర‌మేశ్ మెజార్టీ నా కంటే ఎక్కువ రావాలి. ల‌క్ష మెజార్టీ రావాల‌ని కోరుతున్నాను అని కేసీఆర్ అన్నారు. వ‌ర్ధ‌న్న‌పేటకు చెందిన దాదాపు 40 గ్రామాలను వ‌ర‌గంల్ ప‌ట్ట‌ణంలో విలీనం చేశాం. ఎన్నిక‌ల త‌ర్వాత ఆ గ్రామాల ప్ర‌జ‌ల‌కు సాదా బైనామాకు అవ‌కాశం క‌ల్పిస్తాం. ఈ గ్రామాల‌కు ప్ర‌త్యేక ఫండ్ మంజూరు చేసి అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు.

Latest News

More Articles