Sunday, May 12, 2024

నిజామాబాద్‌ జిల్లాలో ఇవాళ సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభలు

spot_img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్‌.. ప్రచారంలోనూ దూస్కెళ్తోంది. వరుసగా మూడోసారి అధికారమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌  అన్ని నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు  నిర్వహిస్తున్నారు. తొమ్మిదిన్నరేండ్ల నుంచి జరుగుతున్న అభివృద్ధి, ఇప్పటికే అమలులో ఉన్న పథకాలు నిర్విరామంగా కొనసాగాలంటే మరోసారి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలంటూ ప్రజలకు వివరిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం ఇవాళ(సోమవారం) కేసీఆర్‌ ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని జుక్కల్‌, బాన్సువాడ, మెదక్‌ జిల్లాలోని నారాయణఖేడ్‌లో పర్యటించనున్నారు.

మొదట కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌లో జరుగనున్న బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌ను జుక్కల్‌కు చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న బాన్సువాడకు చేరుకుంటారు. పట్టణంలోని వీక్లీ మార్కెట్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత నారాయణఖేడ్‌కు వెళ్తారు. ప్రజా ఆశీర్వాద సభలకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్‌ఎస్‌ నాయకులు ఇప్పటికే పూర్తిచేశారు.

ఇది కూడా చదవండి: బేబి నిన్ను చూస్తుంటే…నారాలోకేశ్‎కు ఆర్జీవీ కౌంటర్..మామూలుగా లేదుగా..!!

Latest News

More Articles