Wednesday, May 1, 2024

బేబి నిన్ను చూస్తుంటే…నారాలోకేశ్‎కు ఆర్జీవీ కౌంటర్..మామూలుగా లేదుగా..!!

spot_img

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ…ఒకరిని టార్గెట్ చేశారంటే..వారిపై ఆయన వేసే కౌంటర్లు, సెటైర్లు మామూలుగా ఉండవు. అవసరమైతే బండబూతులు తిట్టడానికి వెనకాడడు. ఆర్జీవీకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఏదైనా సరే స్ట్రెయిట్ గా చెప్పేస్తారు. కాగా ఏపీలో టీడీపీ, జనసనే, పవన్ కల్యాణ్ ను మొదట్నుంచీ టార్గెట్ చేస్తూనే ఉన్నారు ఆర్జీవీ. ఆయన ట్వీట్లు దుమారం రేపుతున్నాయి. తాజాగా టీడీపీ నేత నారాలోకేశ్ కామెంట్స్ కు ఆర్జీవీ కౌంటర్ ఇచ్చారు. చూడు బేబీ నిన్ను చూస్తుంటే..నవ్వాలా? ఏడవాలో అర్థం కావట్లేదు అంటూ ట్వీట్ చేశారు.

తాను దర్శకుడిని అన్న ఈ వ్యూహం సినిమా డైరెక్టర్ సినిమాలు తియ్యడమే నా పని. ఏపీకి సేవ చేయాల్సిన అవసరం నాకు లేదు. మీలాగా నేను జనం కోసం పుట్టాను..పెరిగాను..జనం కోసం చనిపోతాను అలాంటి మాటలు చెప్పడంలేదు కదా అంటూ ప్రశ్నించారు. పాపం లోకేశ్ కు నన్ను విమర్శించండం సరిగ్గా రావడంలేదు. మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా లోకేశ్ అంటూ ప్రశ్నించారు. అంతేకాదు తనను ఎలా విమర్శించాలో కూడా ట్వీట్ లో వీడియో పోస్టు చేశారు.

ఈమధ్య రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర సెల్ఫీ తీసుకున్న ఆర్జీవీ…బయట నేను ,లోపల ఆయన అనే క్యాప్షన్ సెటైరికల్ ట్వీట్ చేశారు. దీనిపై నారాలోకేశ్ ను మీడియా ప్రశ్నించింది. ఆర్జీవీ గురించి నేను ఏం మాట్లాడాను..ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారా.. సమాజానికి ఏమైనా చేశారా.. అని ప్రశ్నించారు. చంద్రబాబు ఏపీ అభివృద్ధికి చాలా చేశారు, ల‌క్షల మందికి ఉద్యోగాలు క‌ల్పించారు అన్నారు. లోకేశ్ వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆర్జీవీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్జీవీ పంచ్ లకు నెటిజన్లు కామెంట్స్ మామూలుగా లేవు.

ఇది కూడా చదవండి: భోజనం చేసేటప్పుడు తుమ్మితే ఇలా చేయమని శకున శాస్త్రం చెబుతోంది..!

Latest News

More Articles