Tuesday, May 21, 2024

ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు నక్సలైట్లు హతం.!

spot_img

నక్సలైట్లపై జరుగుతున్న దాడుల్లో భద్రతా బలగాలు విజయం సాధించాయి. ఛత్తీస్‌గఢ్‌-మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దాదాపు నలుగురు నక్సలైట్లు హతమైనట్లు సమాచారం. కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. నారాయణపూర్ పోలీసులు అబుజ్‌మద్‌లోని తకమెటా ప్రాంతంలో పెద్ద సంఖ్యలో నక్సలైట్ల క్యాడర్‌ను చుట్టుముట్టడంతో బద్రతా బలగాలకు నక్సలైట్లకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది.మంగళవారం ఉదయం నుంచి ఇరువర్గాల నుంచి భారీగా కాల్పులు జరుగుతున్నాయి. ఎన్‌కౌంటర్‌లో 4 నుంచి 5 మంది నక్సలైట్లు హతమైనట్లు సమాచారం.

ఎన్‌కౌంటర్‌ను నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరించారు. అయితే ఎంతమంది నక్సలైట్లు హతమయ్యారనే విషయాన్ని మాత్రం ఎస్పీ ప్రభాత్ కుమార్ ఇంకా వెల్లడించలేదు. ఎన్‌కౌంటర్ జరుగుతోందని చెప్పారు. ఎన్‌కౌంటర్ ముగిసిన తర్వాతే కచ్చితమైన పరిస్థితి తేలనుంది. ప్రస్తుతం భద్రతా సిబ్బందికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని తకమెటా ప్రాంతంలో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా సోమవారం అర్థరాత్రి సైనికులు సెర్చ్ ఆపరేషన్‌కు బయలుదేరారు. మంగళవారం ఉదయం బలగాలు ఈ ప్రాంతానికి చేరుకోగా, నక్సలైట్లు వారిని చూడగానే కాల్పులు ప్రారంభించారు. దీని తర్వాత బలగాలు కూడా నక్సలైట్ల తూటాలకు ధీటుగా బదులిచ్చారు.

అంతకుముందు ఏప్రిల్ 5న ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సలైట్ మరణించాడు. జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), బస్తర్ ఫైటర్స్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సిబ్బంది నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఉన్నప్పుడు కిరండూల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో కాల్పులు జరిగినట్లు అధికారి తెలిపారు. గత కొన్ని నెలలుగా నక్సలైట్లకు వ్యతిరేకంగా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్..బాలికలదే హవా.!

Latest News

More Articles