Tuesday, May 21, 2024

ప్రతినెలా రూ. 5వేలు కావాలంటే ఈ స్కీంలో చేరండి.!

spot_img

ప్రతినెలా కచ్చితంగా రూ. 5వేలు పొందాలని చూస్తున్నారా.అయితే మీకో అదిరిపోయే స్కీం గురించి పూర్తి సమాచారం చెబుతాం. ఎలాంటి రిస్క్ లేకుండా డబ్బులు వస్తాయి. ఆ స్కీం ఏంటో చూద్దాం.

పోస్టాఫీసులో ప్రతినెలా డబ్బులు అందించే పథకం ఒకటి అందుబాటులో ఉంది. ఈపథకంలో చేరితే ప్రతినెలా డబ్బులు పొందవచ్చు. పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకాన్ని అందిస్తుంది. ఇక్కడ వన్ టైమ్ డిపాజిట్ కూడా ఉంటుంది. అంటే ఒకసారి డబ్బులు పెట్టుబడి పెట్టాలి. దీంతో స్థిరమైన నెలవారీ ఆదాయం పొందవచ్చు. పోస్టాఫీసులో నెలవారీ స్కీమ్ ఉంటుంది. దీని ఎంఐఎస్ అని కూడా పిలుస్తారు. ఈ పథకంలో వడ్డీ రేటు 7.4 శాతం ఉంటుంది. మీ పెట్టుబడిని బట్టి మీరు పొందే నెలవారీ ఆదాయం మార్చుకోవచ్చు. ఒక వ్యక్తి ఈ పథకంలో రూ. 9లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఐదేళ్లపాటు ప్రతినెలా రూ. 5,500 పొందే అవకాశం ఉంటుంది.

ప్రతినెలా డబ్బులు ఎలా పొందాలో తెలుసుకుందాం.మీరు పెట్టుబడి రూపంలో రూ. 9లక్షల పెట్టుబడి పెడితే..ఇప్పుడు వడ్డీ రేటు 7.4శాతం ఉంటుంది. ఐదేళ్లలో మీకు వడ్డీ రూపంలో రూ. 3.33 లక్షలు వస్తాయి. అంటే నెలకు రూ. 5,500 పొందుతారు. ఈ పథకం ఉమ్మడి ఖాతా సౌకర్యాన్ని అందిస్తుంది. అంటే అప్పుడు ఈ పథకంలో గరిష్టంగా రూ. 15లక్షలు డిపాజిట్ చేయవచ్చు. మీరు డిపాజిట్ చేసిన మొత్తం ఐదేళ్లపాటు అంటే మెచ్యూరిటీ తర్వాత మీకు తిరిగి చెల్లిస్తారు. ఈ పథకంపై వచ్చే డబ్బును పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్లో ప్రతినెలా డిపాజిట్ చేస్తారు. దాన్ని మీరు విత్ డ్రా చేసుకోవచ్చు.

పోస్టాఫీసులో నెలవారీ ఆదాయ పథకంలో పెట్టుబడిపై టీడీఎస్ కటింగ్ ఉండదు. అయితే మీరు పొందే వడ్డీ మీ పన్ను స్లాబ్ ప్రకారం పన్ను కడుతుండాలి. ఈ స్కీమ్ లో మెచ్యూరిటీ ముందు డబ్బు విత్ డ్రా చేసుకోవల్సిన అవసరం ఉన్నట్లయితే మీరు ఒక ఏడాది తర్వాత ఈ సదుపాయాన్ని పొందుతారు. అయితే ఫ్రీ మెచ్యూర్ క్లోజర్ విషయంలో మీరు పెనాల్టీ చెల్లించాలి. మీరు ఒక ఏడాది నుంచి మూడేళ్ల మధ్య డబ్బును విత్ డ్రా చేస్తే డిపాజిట్ మొత్తంలో రెండు శాతం పెనాల్టీ పడుతుంది. అందుకే మీరు డబ్బులు పెట్టుబడి పెట్టాలని భావిస్తే..ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకోవాలి. డబ్బు అవసరం లేదని భావిస్తే డిపాజిట్ చేయడం బెటర్.

ఇది కూడా చదవండి: ఉదయాన్నే 10 నిమిషాల నడకతో ఎన్ని బెనిఫిట్సో.!

Latest News

More Articles