Sunday, May 19, 2024

అందోల్ నియోజ‌క‌వ‌ర్గానికి ఒకే విడుత‌లో ద‌ళిత‌బంధు మంజూరు

spot_img

అందోల్ నియోజ‌క‌వ‌ర్గానికి ఒకే విడుత‌లో ద‌ళిత‌బంధు మంజూరు చేయించే బాధ్య‌త నాది అని అన్నారు సీఎం కేసీఆర్. అందోల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని, ఎమ్మెల్యే అభ్య‌ర్థి క్రాంతి కిర‌ణ్‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడారు. అందోల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ద‌ళిత‌బిడ్డ‌లు ఆలోచించాలి. వేల ఏండ్లుగా ద‌ళిత‌జాతి అణిచివేత‌కు, వివ‌క్ష‌కు గురైన జాతి. వాళ్లు మ‌న సాటి మ‌న‌షులే క‌దా..? వాళ్లు కూడా పైకి రావాలి. ప్ర‌జాస్వామ్యం అని చెప్పుకుంటా వారిని అలానే ఉంచ‌డం ధ‌ర్మం కాదు. వాళ్ల‌కు నిజంగానే నిజాయితీ ఉండి, నాడే ద‌ళిత‌బంధు లాంటి కార్య‌క్ర‌మాలు తెచ్చి ఉంటే ఎందుకు ఇవాళ ద‌ళితుల్లో ద‌రిద్రం ఉండేది. స‌మాజంలో అంద‌రిక‌న్నా పేద‌వాళ్లు ద‌ళితులే క‌దా..? ద‌ళిత‌బిడ్డ‌ల‌కు చెప్తున్నా.. క్రాంతి కోరిన‌ట్టు ఒకే విడుత‌లో ఆందోల్‌కు ద‌ళిత‌బంధు ఇచ్చే బాధ్య‌త నాది. దీన్ని పైల‌ట్ ప్రాజెక్టుగా తీసుకొని, ఆందోల్ నియోజ‌క‌వ‌ర్గం యొక్క ద‌ళిత‌వాడ‌ల్లో నుంచి ద‌రిద్రాన్ని పీకి అవ‌త‌ల ప‌డేద్దాం అని అన్నారు సీఎం కేసీఆర్.

ఎస్టీ బిడ్డ‌లు 50 ఏండ్లు కొట్లాడారు మా తండాలో మా రాజ్యం కావాల‌ని. 3,500 తండాల్లో ఎస్టీలే రాజ్యం ఏలుతున్నారని అన్నారు సీఎం కేసీఆర్. మ‌న జోగిపేటలో 14 మంది ఎస్టీ స‌ర్పంచ్‌లు ఉన్నారు. సేవాలాల్ మ‌హారాజ్ జ‌యంతిని అధికారికంగా జ‌రుపుతున్నాం. సేవాలాల్ మ‌హారాజ్ జ‌యంతి రోజున త‌ప్ప‌కుండా సెల‌వు కూడా ఇస్తామ‌ని ప్ర‌క‌టిస్తున్నా అని అన్నారు కేసీఆర్.

ఇది కూడా చదవండి: ప్రజల కొరకు ప్రాణం పోయేవరకు పని చేస్తా

Latest News

More Articles