Monday, May 6, 2024

ప్రజల కొరకు ప్రాణం పోయేవరకు పని చేస్తా

spot_img

పోచంపాడు పేరుతో వరుసగా 6 సార్లు ఓట్లు వేయించూకుని రైతులను మోసం చేసిన మోసకారి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అని మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివ్వెంల ఆత్మకూరు మండలం లోని రామకోటి తండా, జగన్ తండా, ఏపూర్ ఏనుబాముల, ఆత్మకూరు మండల కేంద్రాల్లో ప్రచారం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడిన మంత్రి .. కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 30 ఏళ్ల దామోదర్ రెడ్డి పాలనలో మంచినీళ్ళు లేవన్నారు. గ్రామాలలో బోరుబావులు, పట్టణ ప్రజలకు పాయకాన నీళ్లు తాపించిన దుర్మార్గుడు దామోదర్ రెడ్డి అన్నారు. ఆయన చేసిన పాపం వల్ల రైతుల మోటార్లు కాలిపోయి వారి జీవితం అధోగతి పాలైనదని అన్నారు. దామోదర్ రెడ్డిపాలెం లో రైతుల కళ్ళ లో కన్నీళ్లు వచ్చాయి తప్పా.. బోర్ల నుండి నీళ్ళు మాత్రం రాలేదన్నారు. రైతులే కూలీలతో కలిసి వలసలు పోవాల్సిన దారుణ పరిస్థితి ఉండేది అన్నారు. ఆడపడుచులు బిందెలతో ధర్నాలు చేస్తుంటే, బిందెలు తన్నుకుంటూ పోయిన పాపపు చరిత్ర దామోదర్ రెడ్డి ది, ఆయన అనుచరులదన్నారు. వారి దుర్మార్గం పనుల్లో నలుగురికి అన్నం పెట్టే రైతు అన్నని లేక అల్లాడిపోయిండన్నారు. 30 ఏళ్ల ఆయన రాజ్యంలో అత్తా కోడళ్ల పంచాయతీ లేని ఇల్లు లేదు, రాజకీయ కొట్లాటలు లేని ఊరు లేదన్నారు. పదేళ్ల కాలంలో దామోదర్ రెడ్డి తీసిన అకృత్యాలను రూపుమాపామన్న మంత్రి, పార్టీలకతీతంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇచ్చి, ప్రజాస్వామికంగా పనిచేశా అన్నారు. పదేళ్ల పాలల్లో చేసింది మాత్రమే చూడకుండా, ఏమి చేస్తానో కూడా చెప్పే నాయకుడికి ఓటు వేయండి అని పిలుపునిచ్చారు.

24 గంటల కరెంట్ కల్యాణ లక్ష్మి, ఇంటింటికి మంచినీరు, రైతు బీమా ,రైతు బంధు, పథకాలతో ఎలాగైతే దేశంలో తెలంగాణను నెంబర్ వన్ గా ఉంచామో, ఇళ్ల నిర్మాణం విషయంలో కూడా తెలంగాణలో ఇల్లు లేని వారు అంటూ ఉండకూడదు అనేదే సీఎం కేసీఆర్ పట్టుదల అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మోడీ సొంత రాష్ట్రంలో కూడా నేటికీ ఇచ్చే కరెంట్ ఆరు గంటలే , పెన్షన్ 500మాత్రమే అన్నారు. నెహ్రు నుండి రాహల్ వరకు పార్లమెంటుకు పంపిన అమేధిలో కూడా నేటికీ వచ్చే ఐదు గంటలు మాత్రమే అన్నారు. రైతుల కోసం 32 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం దేశంలో బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. రైతుబంధు ఆపింది కాంగ్రెస్ పార్టీ అన్న మంత్రి, కాంగ్రెస్ దొంగ నాటకాలను ప్రజలు గుర్తించాలని కోరారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే నీళ్లు రావు నిధులు ఉండవు అని అన్నారు.

ఇది కూడా చదవండి: రైతు బంధును కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది

సూర్యాపేటలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ నాయకులు  కూడా ఇల్లు కట్టుకోవాలంటే భయపడే పరిస్థితి ఉండేది అన్నారు. ఇక వ్యాపారులు తమ షాపులను వదిలిపెట్టి పరారైన సంఘటనలు కోకోల్లలున్నాయన్నారు. పేరుకు వైట్ హౌస్ అయినా అక్కడ జరిగేది మాత్రం చీకటి పనులు అని ఆరోపించారు మంత్రి జగదీష్ రెడ్డి. పదేళ్ల క్రితమే పనికిరాదంటూ సూర్యాపేట  ప్రజలు అంగడికి కొట్టిన ఎద్దు మళ్లీ పులినంటూ ప్రజల్లోకి వస్తుందన్నారు. పులులు సింహాలు కాదు పులిమాటున పీక్కు తినడానికి కాచుకు కూర్చున్న నక్కలు, తొడెళ్ళ తో సూర్యాపేట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 30 ఏళ్లలో ఎక్కడో ఒక రోడ్డు వేసి , నేను వేసినా అని చెబుతున్న దామోదర్ రెడ్డి , తన హయాంలోని బీఆర్ఎస్ పాలనలో 600 కోట్లతో వందలాది రోడ్లను సూర్యాపేట నియోజకవర్గం నలుమూలల నిర్మించామన్నారు. మాట తప్పిన చరిత్ర నాకు లేదన్న మంత్రి జగదీష్ రెడ్డి, ప్రజల కొరకు రాజీ పడకుండా ప్రాణం పోయేవరకు పని చేస్తా అన్నారు. ప్రజలకు చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చాను అని అన్నారు.

మళ్లీ ఆశీర్వదిస్తే  సూర్యాపేటకు డ్రైపోర్ట్, ఇండస్ట్రియల్ పార్క్, ఐటీ పరిశ్రమను విస్తరించి 20 వేల మంది  కి పైగా యువతీ యువకులకు ఉపాధి కల్పిస్తానని తెలిపారు. దీనితోపాటు సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రతి పేద మహిళలకు నెలకు 3000 పెన్షన్, భూమిలోని నిరుపేదలకు ఐదు లక్షలతో కేసీఆర్ భీమా, 400కే గ్యాస్ సిలిండర్, రేషన్ బియ్యం ద్వారా సన్న బియ్యం పంపిణీ, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం, ఆసరా దివ్యాంగుల పెన్షన్ పెంపు, మహిళా సమాఖ్యలకు సొంత భవన నిర్మాణాలు, అగ్రవర్ణ పేదలకు గురుకులాలు, రైతుబంధు 16,000 చేసి నూటికి నూరు శాతం అమలు చేస్తామన్నారు. మంచి చేశానని అనుకుంటే ఆశీర్వదించండి . మీ వెంటే ఉంటా..  మీకు తోడై నిలుస్తా అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.

ఇది కూడా చదవండి: పథకాలను ఆపగలరేమో కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని అడ్డుకోలేరు

Latest News

More Articles