Sunday, May 19, 2024

పథకాలను ఆపగలరేమో కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని అడ్డుకోలేరు

spot_img

రైతులకు రైతుబంధు అందకుండా చేసిన కాంగ్రెస్ పార్టీ కుట్రలపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ 2.5 కోట్ల రైతు కుటుంబాల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. ‘రాజకీయ లబ్ది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏమీ పట్టవు. నాడు తెలంగాణను ఎండబెట్టి సర్వనాశనం చేసింది. నేడు తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నది. తాత్కాలికంగా కాంగ్రెస్ రైతుబంధును అడ్డుకోగలదేమో.. కానీ డిసెంబరు 3 తర్వాత అడ్డుకోలేదు. నిస్సిగ్గుగా రాజకీయాల కోసం కాంగ్రెస్ అవరోధాలు సృష్టిస్తున్నది. వ్యవసాయరంగాన్ని నిలబెట్టాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచంలోనే తొలిసారి రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చి రైతులకు అండగా నిలుస్తున్నారు. కోటి 50 లక్షల ఎకరాలకు 11 విడతలుగా రైతుబంధు అమలుచేస్తున్నాం. తెలంగాణలో వ్యవసాయం స్థిరపడ్డది.. బలపడ్డది. ఎన్నికల కోసం రైతులు వ్యవసాయం ఆపలేరు. రైతులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తున్నది. కాంగ్రెస్‎లో ఒక నేత రైతుబంధు ఎందుకు అంటారు.. మరొకరు 24 గంటల కరంటు ఎందుకు అంటారు. కాంగ్రెస్ నాయకుల మాటల్లో తెలంగాణ వ్యవసాయం మీద, తెలంగాణ రైతుల మీద కక్ష కనిపిస్తున్నది. కాంగ్రెస్ నేతలు పథకాలను ఆపగలరేమో కానీ.. ప్రజలు ఎన్నుకునే కేసీఆర్ ప్రభుత్వాన్ని మాత్రం అడ్డుకోలేరు’ అని మంత్రి స్పష్టం చేశారు.

Read Also: రైతుబంధువును ఆదరించండి..! రాబందులను తరిమికొట్టండి..!

Latest News

More Articles