Saturday, May 18, 2024

డిసెంబర్ 6వ తేదీ నుండి రైతు బందు యధావిధిగా వస్తది

spot_img

ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ శ‌క్తి 3వ తేదీ వ‌ర‌కే.. 6వ తారీఖు నుంచి య‌ధావిధిగా రైతుబంధు మీ ఖాతాల్లో జ‌మ అవుతద‌ని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఒక రైతుబంధుతోనే ఒక్క విడ‌త రైతుబంధు వేస్తేనే మ‌న‌కు ఓట్లు వ‌స్తాయ‌ని అనుకుంటున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని, ఎమ్మెల్యే అభ్య‌ర్థి కాలే యాద‌య్య‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడారు.

అప్ప‌టి రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ వ‌స్తే మ‌న భూముల ధ‌ర‌లు ప‌డిపోతాయి. న‌ష్ట‌పోతామ‌ని చెప్పారు. మీరే గ‌మ‌నించాలి. ఇవాళ భూముల ధ‌ర‌లు ఏ విధంగా పెరిగాయి. ఏ విధంగా మ‌నం లాభాప‌డుతున్నాం అనేది ఆలోచించాలి. నిర్ణ‌యం మంచి ఆలోచ‌న చేసి ఓటు వేయండి. అగాథం ఓటు మాత్రం వేఒయ‌ద్దు. ఎన్నిక‌లు రాగానే త‌ప్పుడు మాట‌లు ప్ర‌చారం చేయ‌డం, ర‌క‌ర‌కాల పిచ్చి ప్ర‌య‌త్నాలు కూడా చేస్త‌రు. ఎన్నిరోజులు అయింది మ‌న రైతుబంధు ఇయ్య‌బ‌ట్టి. ఇది ఆరో సంవ‌త్స‌రం. క్ర‌మం త‌ప్ప‌కుండా మ‌నం ఇచ్చుకుంటున్నాం. ఇప్పుడు టైం వ‌చ్చింది. యాసంగి పంట‌ల‌కు రైతులు పొలాలు త‌డుపుతున్నారు. రైతుబంధు వేయాలి. ఇక దాన్ని ఇయ్య‌నియొద్దంటే ఇయ్య‌నియొద్ద‌ని కాంగ్రెసోళ్లు రోజు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌కు ద‌ర‌ఖాస్తు. ఇది రెగ్యుల‌ర్ కార్య‌క్ర‌మం. కొత్తగా సాంక్ష‌న్ చేసి ఇస్త‌లేం పాత‌దే. కొన‌సాగింపు అని చెప్తే ఒక రోజు టైం ఇచ్చారు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌. నిన్న కాంగ్రెస్ మ‌ళ్ల ఢిల్లీకి పోయి సికాయ‌త్ చేసి  రైతుబంధు ఆపేశారు. రైతుబంధు ఆపితే వాళ్ల‌కు ఓట్లు వ‌స్తాయ‌ని అనుకుంటున్న‌రు. ఎన్ని రోజులు ఆపుతావ్ నువ్వు. మూడో తారీఖు ఓట్లు లెక్క‌పెడితే మ‌ళ్ల మ‌న గ‌వ‌ర్న‌మెంటే వ‌స్తుంది. బ్ర‌హ్మాండంగా ఆరో తారీఖు నుంచి సంతోషంగా ఇచ్చుకుంటాం ఎవ‌రి మోతాదు లేకుండా అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

చేవెళ్ల నుంచి తెలంగాణ రైతుల‌కు తెలియ‌జేస్తున్నా. మీరేం రందీ ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. మ‌ళ్ల వ‌చ్చేది మ‌న గ‌వ‌ర్న‌మెంటే. ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ ఆపినా.. వాళ్ల శ‌క్తి అంతా మూడో తారీఖు వ‌ర‌కే. ఆరో తేదీ నుంచి రైతుబంధు యథావిధిగా వ‌స్త‌ది ఏం బాధ‌ప‌డొద్ద‌ని చెబుతున్నా. అంటి గింత నీచంగా ఆలోచిస్త‌రు. రైతుబంధు కొత్త‌ది కాదు కదా..? ఆరేడు ఏండ్ల నుంచి ఇస్తున్నం. అది రెగ్య‌ల‌ర్ కార్య‌క్ర‌మం. కొత్త‌గా సాంక్ష‌న్ చేయ‌లేదు. దాన్ని కూడా ఆపితే మ‌న‌కు లాభం జ‌రుగుత‌దేమో అని కాంగ్రెసోళ్లు ఆలోచిస్తున్నారు అని కేసీఆర్ మండిప‌డ్డారు.

ఇది కూడా చదవండి: ధరణి పోర్టల్ పుణ్యమా భూములు భద్రంగా వున్నాయి

Latest News

More Articles