Friday, May 17, 2024

ధరణి పోర్టల్ పుణ్యమా భూములు భద్రంగా వున్నాయి

spot_img

దేశంలో ఎన్నికలు వస్తే అన్ని అబద్దాలు.. ఎట్లా అయినా గెలవాలని అబద్దాలు చెప్తారని అన్నారు సీఎం కేసీఆర్. వచ్చే ఐదేళ్ల భవిష్యత్ కోసం ఓటు వేస్తాం. పార్టీ ల నడవడిక , ప్రజల పట్ల వారి దృక్పధం చూడాలన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ప్రజా ఆశీర్వాద సభ లో పాల్గొని మాట్లాడారు సీఎం కేసీఆర్. ఉన్న తెలంగాణ ను ఊడ గొట్టిందే కాంగ్రెస్ పార్టీ.. ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్. షాద్ నగర్ మంచినీళ్ల కోసం అరిగోస పడ్డది. పెన్షన్ లు ఐదువేలకు తీసుకుని పోతాం. షాద్ నగర్ లో 220 చెరువులు బాగు చేసుకున్నాం. రైతు బంధు పథకం తీసుకొచ్చిందే బీఆర్ఎస్. రైతు బంధు ఉండాలంటే అంజయ్య యాదవ్ గెలవాలన్నారు.24 గంటల కరెంట్ ఉండలంటే అంజయ్య గెలవాలి. మూడు గంటల కరెంట్ రైతులకు జీవన్మరణ సమస్య. ధరణి పోర్టల్ పుణ్యమా భూములు భద్రంగా వున్నాయన్నారు.

భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రికి కూడా లేదన్నారు సీఎం కేసీఆర్. ఇందిరమ్మ రాజ్యంలో పట్వారిల గోల్ మాల్ చూడలేదా అని అన్నారు. ఆసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తాము. బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నిర్ణయం ఇదేనని తెలిపారు. కాంగ్రెస్ రైతుబంధు ఆపింది. రైతు బంధు కాంగ్రెస్ నాయకులు తీసుకుంటారు. కాంగ్రెస్ కార్యకర్త గుండె మీద చేయు వేసుకుని ఆలోచించాలి. షాద్ నగర్ వరకు మెట్రో రైలు తీసుకొస్తాం.మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం.

లక్ష్మి దేవిపల్లి రిజర్వాయిర్ ఏర్పాటు చేయాలి. కానీ పాలమూరు ప్రాజెక్ట్ ను అడ్డుకున్నదే కాంగ్రెస్ పార్టీ. కేసులు వేసిందే కాంగ్రెస్. ఉద్దండ పూర్ నుండి కూడా నీళ్లు వస్తాయన్నారు సీఎం కేసీఆర్.

ఇది కూడా చదవండి: రైతుబంధు పార్టీ కావాలా.. రాబందుల పార్టీ కావాలా.. ప్రజలు ఆలోచించుకోవాలి

Latest News

More Articles