Saturday, May 18, 2024

వంద ఏండ్ల‌లో ఈ ప‌దేండ్లే తెలంగాణ ప్ర‌శాంతంగా ఉన్న‌ది

spot_img

తెలంగాణ రాష్ట్రం గ‌త ప‌దేండ్ల‌ నుంచి ప్ర‌శాంతంగా ఉందన్నారు సీఎం కేసీఆర్. ఈ 100 ఏండ్ల‌లో ఈ ప‌దేండ్లే తెలంగాణ‌ ప్ర‌శాంతంగా ఉన్న‌ది. క‌ర్ఫ్యూ లేదు.. పంచాయితీ లేదు.. లొల్లి లేదు. మంచిగా ఉన్న‌దని తెలిపారు. పెద్ద‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ఉన్న‌ప్పుడు తెల్లారితే క‌ర్ఫ్యూ, మ‌త‌క‌ల్లోలాలు, ఆ పంచాయితీల‌న్నీ ఎవ‌రు పెట్టారో ఆలోచించాలన్నారు. ఓటు అనేది ముఖ్యమని.. పాలిటిక్స్ కూడా చాలా ముఖ్యమన్నారు. రాయి ఏందో.. ర‌త్నం ఏందో గుర్తు ప‌ట్టాలన్నారు. పార్టీల వైఖ‌రి కూడా చాలా ముఖ్యం అని కేసీఆర్ అన్నారు.

పెద్ద‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో ఉన్న మ‌నోహ‌ర్ రెడ్డి నిస్వార్థంగా ప‌ని చేస్తాడని అన్నారు సీఎం కేసీఆర్. ఈ ప‌దేండ్ల‌లో ఒక్క రోజు కూడా వ్య‌క్తిగ‌త ప‌నుల గురించి అడ‌గ‌లేదన్నారు. పెద్ద‌ప‌ల్లి ప‌నులు.. మా ఆయ‌క‌ట్టుకు నీళ్లు వ‌స్త‌లేవు.. మీద మోటార్లు పెడుతున్నారని నాకు చెప్పేవారని అన్నారు.అంతేకాదు.. ప‌దేండ్ల కింద‌నే రూ. 40 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ప్ర‌తి ఊరికి చెట్లు పంపిణీ చేశారన్నారు. సాదాసీదాగా మీ మ‌ధ్య ఉండే వ్య‌క్తి. మీ కోసం ప‌ని చేసే వ్య‌క్తి మనోహర్‌రెడ్డిని ల‌క్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాల‌ని కేసీఆర్ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి:  బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

Latest News

More Articles