Monday, May 20, 2024

బీఆర్ఎస్ టార్గెట్ 65 ఎంపీ సీట్లు .. కేంద్రం మెడలు వంచే ప్రణాళిక ఇదే

spot_img

65 ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని సీఎం కేసీఆర్ నిన్న చేసిన కీలక కామెంట్స్ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. మహారాష్ట్రలో 48 స్థానాలు, తెలంగాణలో 17 సీట్లలలో విజయం సాధిస్తే బీఆర్ఎస్ చక్రం తిప్పొచ్చని చెప్పారు కేసీఆర్. బీఆర్ఎస్‌కు చెందిన 65 మంది ఎంపీల మద్దతు లేకుండా కేంద్రంలో ఏ ప్రభుత్వమూ రాదన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేంద్రాన్ని మెడలు వంచుతామంటున్న కేసీఆర్ మాటలకు లాజిక్ ఇదే అని అంటున్నారు.

తెలంగాణలో పదిహేడు.. మహారాష్ట్రలో 48 సీట్లు కలుపుకొని.. మొత్తంగా 65 సీట్లలో బీఆర్ఎస్ విజయం సాధిస్తే.. కేంద్రం మెడలు వంచేయొచ్చని బీఆర్ఎస్ నాయకులు నమ్మకంతో ఉన్నారు. సీఎం కేసీఆర్ చెప్పిందే జరిగితే.. బీఆర్ఎస్ లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యే పరిస్థితి ఉండదని.. కేసీఆర్ తద్వారా దేశానికి నేత్రత్వం వహించే వీలుందని బీఆర్ఎస్ వర్గాలు సైతం చెప్తున్నాయి.

 

Latest News

More Articles