Sunday, May 19, 2024

పార్లమెంట్‌ సాక్షిగా పచ్చి అబద్దాలు.. తెలంగాణపై మోడీ విషప్రచారం

spot_img

తెలంగాణపై పార్లమెంట్‌ సాక్షిగా మరోసారి పచ్చి అబద్ధాలాడింది బీజేపీ. లోక్‌సభలో ముగ్గురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్రం.. తెలంగాణలో సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం అమల్లో లేదని చెప్పింది. వాస్తవానికి తెలంగాణలో సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌పై 2016లోనే నిషేధం అమల్లోకి వచ్చింది. సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని అడ్డుకునేందుకు తెలంగాణలో ఎన్ని చర్యలు చేపట్టినా మోదీ సర్కారు ఉద్దేశపూర్వకంగానే బురద చల్లుతున్నదని నిపుణులు పేర్కొంటున్నారు.

దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం అమలు గురించి లోక్‌సభలో వివరించిన కేంద్ర ప్రభుత్వం.. ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌కు సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని చెప్పింది. మిగతా రాష్ట్రాల్లో కొన్ని చోట్ల పూర్తిగా, మరికొన్ని చోట్లపాక్షికంగా నిషేధం అమలవుతున్నట్టు పేర్కొన్నది. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై అక్కసుతోనే ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నదని నిపుణులు మండిపడుతున్నారు.

Latest News

More Articles