Saturday, May 11, 2024

ఎమర్జెన్సీ దిశగా దేశం.. సీఎం కేసీఆర్..!

spot_img

బీజేపీ పాలనలో దేశం ఎమర్జెన్సీ దిశగా వెళ్తున్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. మోదీ సర్కారు పనిగట్టుకొని సకల రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నదని మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్డినెన్స్‌ ద్వారా ఢిల్లీ ప్రజలను మోదీ సర్కారు అవమానించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోకుంటే పార్లమెంట్‌లో దా నిని అడ్డుకొని తీరుతామని స్పష్టంచేశారు.

నాడు అలహాదాబాద్‌ కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి ప్రజాస్వామ్యా న్ని అవమానిస్తే, ఇప్పుడు మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి అదే పని చేసిందని ధ్వజమెత్తారు. నాడు నేడు ఒకే రకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. శనివారం ప్రగతి భవన్‌లో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌సింగ్‌ మా న్‌తో కలిసి కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. కేం ద్ర ప్రభుత్వ అరాచకాలు, ఆగడాలు పరాకాష్టకు చేరుకొన్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పు తిప్పలు పెడుతూ, పనిచేయకుండా అడ్డుకొంటున్నదని మండిపడ్డారు.

Latest News

More Articles