Saturday, May 18, 2024

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్స‌వాలపై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

spot_img

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ- కార్యక్రమాలు – కార్యాచరణ తదితర అంశాల పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం కొనసాగుతున్నది.

ఈ సమీక్షలో మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి; ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్; ఎమ్మెల్యే జీవన్ రెడ్డి; సీఎం ప్రధాన సలహాదారు సోమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, డిజిపి అంజని కుమార్, సిపి సివి ఆనంద్ , సీఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, ఆర్ అంబ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, ఐ అండ్ పి ఆర్ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, జాయింట్ డైరక్టర్ జగన్ తదితరులున్నారు.

రాష్ట్రం ఈ 9 ఏండ్లలో సాధించిన విజయాలను ప్రతిబింబించేలా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన విష‌యం విదిత‌మే. జూన్‌ 2న ప్రారంభమై 21 రోజులపాటు కొనసాగనున్న ఉత్సవాల ప్రణాళికను సిద్ధం చేసేందుకు శుక్రవారం సచివాలయంలో మంత్రి హ‌రీశ్‌రావు అధ్య‌క్ష‌త‌న‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

Latest News

More Articles