Saturday, May 18, 2024

సీఎం రేవంత్ భాష మారదా? అదే భాష..అదే తీరు..!

spot_img

సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తన స్థాయి, హోదాను మరిచి బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ను బొందపెడతాం..బొక్కబోర్లాపడ్డా బుద్దిరాలేదంటూ…సీఎం అనే కనీస సోయి లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో మంగళవారం జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత రేవంత్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పై తీవ్ర పదజాలంతో పిచ్చి పిచ్చి కూతలు కూసారు. బీఆర్ఎస్ పార్టీపై..పార్టీ అధినేత కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ…తన హోదాను, స్థాయిని మర్చిపోయి అనుచిత భాషను ప్రయోగిస్తూ వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్ పదాజాలం, వ్యాఖ్యలు, మాట్లాడుతున్న భాష, బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్ రావులను బిల్లా, రంగా అంటూ సంభోదించడం వివాదం అవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం ధోరణిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొందపెట్టారని..రాష్ట్రంలో ఆ పార్టీ చచ్చిపోయందన్నారు. కేటీఆర్, హరీశ్ రావు తమ పార్టీ మనుగడ కోసం కాంగ్రెస్ పార్టీపై మాటల దాడి చేస్తున్నారంటూ విమర్శించారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి భాష, తీరుపై పలువురు మండిపడుతున్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు.

ఇది కూడా చదవండి: మొత్తానికి మళ్ళీ పని షురూ చేసిన సమంత…ఏం చేస్తోందంటే..!!

Latest News

More Articles