Saturday, May 18, 2024

టీఎస్‌పీఎస్సీపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం

spot_img

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్‌పీఎస్సీని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల పనితీరును అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి మంగళవారం సచివాలయంలో సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీలోని యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాలకు ఉన్నతాధికారుల బృందాన్ని పంపి అక్కడి నియామకాల అధ్యయనం చేసి.. ప్రక్రియపై నివేదికను రూపొందించి అందజేయాలన్నారు.

Read Also: స్పీకర్‌ ఎన్నికకు సహకరించాలంటూ కేసీఆర్ ముందు కాంగ్రెస్ మంత్రులు

కమిషన్‌ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకతతో చేపట్టేందుకు కట్టు దిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. అలాగే చైర్మన్‌, సభ్యుల నియామకాలను సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పారదర్శకంగా ఉండేలా మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. కమిషన్‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కావాల్సిన సిబ్బంది, ఇతర సదుపాయాలను వెంటనే కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సీఎస్‌ శాంతికుమారి, సీఎం కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవీ గుప్తా, అడిషనల్ డీజీ సీవీ ఆనంద్, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, సిట్ స్పెషల్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles