Saturday, May 18, 2024

ప్రమాణ స్వీకారం తరువాత సీఎం రేవంత్ రెడ్డి తొలి ట్వీట్

spot_img

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా మొత్తం11 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను తప్పక అమలు పరిచే అభయ హస్తంపై తొలి సంతకం చేశారు.

సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇవాళ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు . తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది అన్నారు. సామాజిక, న్యాయం, సమాన అభివృద్ధి తో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుందన్నారు. పేదల ముఖాలు వెలుగులు వెల్లులిస్తాయన్నారు. ఇది మీ అన్న ఇస్తున్నమాట అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Latest News

More Articles