Sunday, May 19, 2024

త్వరలో మెగా డిఎస్సీ ?

spot_img

తెలంగాణలో విద్యా విధానంలో నెలకొన్న సమస్యలపై శనివారం సచివాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే. ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ చదువుకై ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దని సూచించారు.

విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలను తెరిపించాలన్నారు. ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే’ అని రేవంత్ రెడ్డి ఆదేశంచారు. దీనికోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను భర్తీకి చర్యలను తీసుకోవాలని రేవంత్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ కాళీలను భర్తీ చేయడానికి డీ.ఎస్.సి నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Latest News

More Articles