Sunday, May 19, 2024

తమిళనాడులో సంచలనం.. ఇంచార్జ్ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ ?

spot_img

తమిళనాడు రాజకీయాల్లో రసవత్తర చర్చ నడుస్తుంది. సీఎం స్టాలిన్ తన కొడుకు ఉదయనిధి స్టాలిన్‌ను ఉపముఖ్యమంత్రిగా చేస్తారనే ప్రచారం అరవ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఉదయనిధికి ఇన్‌ఛార్జి సీఎం బాధ్యతలు అప్పగిస్తారని కూడా మరో ప్రచారం జరుగుతోంది. డీఎంకే నుంచి దీనిపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ, దానిపై చాలా ఊహాగానాలే నడుస్తున్నాయి. ఉదయనిధిని డిఎంకె యువజన విభాగం అధిపతిగా చేస్తారని, పార్టీ టిక్కెట్‌తో పాటు మంత్రి పదవి కూడా ఇస్తారని గతంలో ప్రచారం సాగింది. అందుకు తగ్గట్టుగానే ఉదయనిధి ఇప్పుడు అన్ని పదవులు అనుభవిస్తున్నాడు. తమిళనాడుకు ఆయన ఉప ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం కూడా చాలా కాలంగా ఉంది. స్టాలిన్ విదేశీ పర్యటనకు ముందో.. లేదా లోక్‌సభ ఎన్నికలకు మునుపో ఉదయనిధికి ఉపముఖ్యమంత్రిగా ప్రమోషన్ గ్యారెంటీ అని ఊహాగానాలు జోరందుకున్నాయి.

అయితే ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రం ఈ పుకార్లపై ఆచితూచి స్పందిస్తున్నారు. గతంలో తన ఆరోగ్యంపై పుకార్లు లేవనెత్తిన ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ఉదయనిధిని రాజకీయంగా ఎదగడంలో కూడా పాలుపంచుకున్నాయని అంటూ స్టాలిన్ వ్యగ్యంగా స్పందించారు. అయితే కొడుకుకి ఇన్‌ఛార్జ్ సీఎం పదవి కూడా అవసరం లేదనే వాదన వినిపిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం అంతకంతకూ పెరిగిపోవడంతో సిఎంకి ఇన్ ఛార్జ్ ఎందుకని తమిళనాడులో ప్రతిపక్షాలు అంటున్నాయి. స్టాలిన్ మాత్రం ఇంచార్జ్ సీఎం పదవి ఇస్తానని అప్పట్లో చెప్పారు. రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ ఇంచార్జ్ సీఎం పదవి అంశాన్ని లేవనెత్తడం ద్వారా ఉదయనిధిని రాజకీయాల్లో తన వారసుడిగా నిలబెట్టాలని స్టాలిన్ నెమ్మదిగా ప్రయత్నిస్తున్నారని మరికొందరు వాదిస్తున్నారు.

 

Latest News

More Articles