Friday, May 17, 2024

గృహలక్ష్మీ దరఖాస్తులు వృథా

spot_img

బీఆర్ఎస్ హయాం చివరలో గృహ లక్ష్మీ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడు అందరూ క్యాస్ట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ల కోసం మీ సేవల్లో నిండిపోయారు. ఎట్టకేలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆ దరఖాస్తులను పరిశీలించాల్సిన అవసరం లేదనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్దిదారులను ఎంచుకుంటామని ఓ మంత్రి ఇటీవలే తెలిపారు.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గృహ లక్ష్మీ పథకానికి బదులు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టనుంది. సాధారణంగా ఇందిరమ్మ ఇళ్లను గ్రామ సభలలోనే లబ్దిదారులను ఎంచుకుని ఆర్థిక సహాయం ప్రకటించేది. ఈ సారి కూడా గ్రామ సభల్లోనే ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. అందుకే.. గతంలో గృహలక్ష్మీ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి సహాయం కోసం చేసుకున్న దరఖాస్తులను పరిశీలించడానికి బ్రేకులు వేసినట్టు సమాచారం.

Latest News

More Articles