Sunday, May 19, 2024

రైతుబంధు రాలేదన్న రైతు మీద కేసు పెట్టిన కాంగ్రెస్ నాయకులు

spot_img

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుబంధు ఎకరానికి 15 వేలు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి నెలదాటిపోయినా రైతుబంధు రాకపోవడంతో రైతులు ఆందోళనలో పడ్డారు. రైతుబంధు రాకపోవడంతో చేతిలో డబ్బులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాలం అవుతున్నప్పటికీ చేతిలో సరిపోయేంత పెట్టుబడి లేకపోవడంతో అగచాట్లు పడుతున్నారు. ఓ వైపు సమయం మించిపోతుండటం.. మరోవైపు పైసలు లేకపోవడంతో దిక్కులు చూస్తున్నారు.

Read also: డ‌బ్ల్యూపీఎల్‌ 2024 షెడ్యూల్ విడుదల.. ఈ సారి రెండు నగరాలలో మ్యాచులు

రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధును విడుదల చేయకపోవడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. రైతుబంధు వస్తే వేడినీళ్లకు చన్నీళ్లు తోడుగా ఉండేదని, వ్యవసాయ పనులైతే మొదలుపెట్టుకునేవాళ్లమని రైతులు అంటున్నారు. రైతుబంధు రాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో మళ్లీ ప్రైవేటు అప్పుల కోసం తిరగాల్సి వస్తున్నదని ఆవేదన చెందుతున్నారు.

ఈ క్రమంలో కొడంగల్ – కొత్తూరు గ్రామానికి చెందిన కోస్గి బాల్ రెడ్డి అనే రైతు రైతుబంధు లేదు, రుణమాఫీ అమలు కాలేదని వాపోయాడు. గత 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్.. అప్పడు చేయలేని పనులు ఇప్పడు ఎలా చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు మాటలు చెప్పడం తప్ప.. ఏంచేయరని ఆయన అన్నారు. దాంతో ఆయన మీద చర్యలు తీసుకోవాలని బొమ్రాస్ పేట పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు.

Latest News

More Articles