Saturday, May 18, 2024

పోక్సో కేసులు 36 శాతం పెరిగాయి

spot_img

హనుమకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంబర్ కిషోర్ ఝా మీడియా సమావేశం నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ 2023 క్రైమ్ వార్షిక నివేదిక వెల్లడించారు. గ‌తేడాది కంటే ఈ ఏడాది 7.7 శాతం నేరాలు పెరిగాయ‌న్నారు. పోక్సో కేసులు 36 శాతం పెరిగాయ‌ని తెలిపారు. మ‌హిళ‌ల‌పై 18 శాతం నేరాలు పెరిగాయ‌న్నారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రూ. 12 కోట్ల విలువైన వ‌స్తువులు, డ‌బ్బులు స్వాధీనం చేసుకున్న‌ట్లు చెప్పారు. 18 మందిపై పీడీ యాక్ట్ లు న‌మోదు చేశామ‌న్నారు. మాద‌క‌ద్ర‌వ్యాల‌పై ఉక్కుపాదం మోపుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. డ్ర‌గ్స్ కొనుగోలు చేసినా, అమ్మినా క‌ఠినంగా శిక్షిస్తామ‌న్నారు సీపీ అంబర్ కిషోర్ ఝా.

ఈ ఏడాది 1167 మ‌హిళా మిస్సింగ్ కేసులు న‌మోదు కాగా, 90 శాతం చేధించామ‌న్నారు. వ‌రంగ‌ల్ న‌గ‌రంలో సీసీ టీవీ కెమెరాలు పెంచుతామ‌న్నారు. మ‌హిళ‌ల‌పై నేరాల‌ను, సైబ‌ర్ క్రైమ్‌ను అరిక‌డుతామ‌న్నారు. భూక‌బ్జాదారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌న్నారు. చిట్ ఫండ్స్ కంపెనీల కారణంగా ఇబ్బందులు ప‌డ్డ‌వారికి న్యాయం చేస్తామ‌న్నారు. న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కోసం ఇంకా ఎవ‌రూ ద‌ర‌ఖాస్తు చేసుకోలేద‌ని తెలిపారు. డిసెంబ‌ర్ 31న డ్రంక్ అండ్ డ్రైవ్ చేప‌డుతామ‌ని సీపీ అంబ‌ర్ కిషోర్ ఝా స్ప‌ష్టం చేశారు.

ఇది కూడా చదవండి: దట్టమైన పొగ మంచుతో ఢిల్లీ లో విమాన, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం

Latest News

More Articles