Saturday, May 18, 2024

దళితబంధు పథకాన్ని కొనసాగించాలి..కలెక్టరేట్ ను ముట్టడించిన దళిత సంఘాలు..!!

spot_img

బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించాయి దళిత సంఘాలు.

కాంగ్రెస్ సర్కార్ ఏర్పాడి ఆరునెలలు గడవక ముందే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే కాంగ్రెస్ ప్రజలు తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారు. తాజాగా గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ కార్యాలయాన్ని దళిత సంఘాలు ముట్టడించాయి.

ఈ పథకానికి ఎంపికైన లబ్ధిదారులు వెంటనే దళిత బంధు ఇవ్వాలని..ఈ పథకాన్ని యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రౌండింగ్ ను పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా పథకాన్ని అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే పెద్దెత్తున ఉద్యమం చేపడతామంటూ హెచ్చరించాయి దళిత సంఘాలు.

ఇది కూడా చదవండి: రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి మాకు ఆహ్వానం అందలేదు: అఖిలేష్ యాదవ్..!!

Latest News

More Articles