Saturday, May 4, 2024

ఒప్పో నుంచి రెండు సరికొత్త ఫోన్లు…ధర, ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు..!!

spot_img

ఈరోజు Oppo యొక్క Reno 11 సిరీస్ 5G భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఉదయం 11 గంటలకు లాంచ్ చేసింది.రెనో 11 సిరీస్ 5G ఇప్పటికే చైనాలోనూ ప్రవేశపెట్టింది. రెనో 11 సిరీస్ 5G ఏ ఫీచర్లతో భారతదేశంలోకి లాంచ్ పెట్టిందో చూద్దాం.

Reno 11 సిరీస్ 5Gలో తీసుకొచ్చిన డివైస్‌లో Mediatek Dimensity 8200 ప్రాసెసర్ ను అందించింది. కొత్త సిరీస్‌లో తీసుకొచ్చిన ఫోన్‌లు 12GB + 12GB ర్యామ్ , 256 జిబి స్టోరేజీతో మెగా మెమరీని అందించింది. రెనో 11 సిరీస్ 5జీలో తీసుకొచ్చిన ఫోన్లను ప్రత్యేక డిజైన్‌తో తీసుకువచ్చింది. భారత్ లో 3D ఎచింగ్ ప్రాసెస్‌తో తీసుకురాబడిన మొదటి పరికరం ఇదే. రెనో 11 సిరీస్ 5జీలో వస్తున్న ఫోన్లు అల్ట్రా సిమ్ డిజైన్‌తో.. రెనో 11 సిరీస్ 5జీ ఫోన్లు 120హెర్ట్జ్ 3డీ కర్వ్డ్ స్క్రీన్‌తో అందుబాటులోకి వచ్చాయి. ఫోన్ లో 6.7 అంగుళాల AMOLED స్క్రీన్ అందించింది.

కెెమెరా: 

ఇక కెమెరా గురించి తెలుసుకుంటే…రెనో 11 సిరీస్ 5G ఫోన్‌లు అల్ట్రా-క్లియర్ పోర్ట్రెయిట్ కెమెరా సిస్టమ్‌తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్‌లో 50MP అల్ట్రా క్లియర్ మెయిన్ కెమెరా, 32MP టెలిఫోటో పోర్ట్రెయిట్ కెమెరా, 112 డిగ్రీ అల్ట్రా వైడ్ కెమెరా 32MP అల్ట్రా క్లియర్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.రెనో 11 సిరీస్ 5Gలో తీసుకువచ్చిన పరికరం 4600mAh బ్యాటరీని కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌లో 80W SuperVooc ఫ్లాష్ ఛార్జ్ సౌకర్యం కూడా ఉంటుంది.

ధర: 

ఇక ధర గురించి తెలుసుకుంటే…8జీబీ, 128జీబీ వేరియంట్ ధర రూ. 29,999గా నిర్ణయించింది కంపెనీ. 8జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ. 31,999గా పేర్కొంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు వేవ్ గ్రీన్, రాక్ గ్రే కలర్లో అందుబాటులో ఉన్నాయి. జనవరి 25 నుంచి ఫ్లిప్ కార్ట్, ఒప్పో వెబ్ సైట్ల తోపాటు ఇతర రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ఎస్బీఐ, ఐసీఐసీఐ, వన్ కార్డ్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ తోపాటు ఈఎంఐ సదుపాయంతో కొనుగోలు చేసిన వారికి రూ. 4వేల వరకు డిస్కౌంట్ లభించనుంది. పాత ఫోన్ ఎక్స్ చేంజ్ చేస్తే అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చని పేర్కొంది.

ఇది కూడా చదవండి: దళితబంధు పథకాన్ని కొనసాగించాలి..కలెక్టరేట్ ను ముట్టడించిన దళిత సంఘాలు..!!

Latest News

More Articles